ఐఐటీ బొంబాయి విద్యార్ధి జీతం ఏడాదికి రెండు కోట్లు
తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాడికి వేతనం కోటి..
ఇరవై నిండిన అమ్మాయి సంపాదన ఎనబై లక్షలు
ఎక్కడ చూసిన క్యాంపస్ నియమాకాల్లో దుమ‍్మురేపుతున్న కుర్రకారు వార్తలే.. ఇదంత గతం. కానీ ఇప్పుడు ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లు కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయనే కథనాల్ని చదివే ఉంటాం. నాణేనికి ఒకవైపు ఇలా ఉంటే ..మరోవైపు మాత్రం ఫ్రెషర్లు భారీ ఎత్తున ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం ఇట్టే దక్కించుకుంటున్నారని అంటున్నారు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్‌ఆర్ విభాగాధిపతి క్రిష్ శంకర్. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫ్రెషర్ల గురించి, వారి జీతభత్యాలు, ప్రమోషన్ల గురించి క్రిష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్ఫోసిస్‌లో ఏడేళ్ల పాటు సేవలందించిన కృష్ణశంకర్ మంగళవారం (మార్చి 21) పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో కొత్తగా (ఫ్రెషర్స్) ఉద్యోగంలో చేరిన వారి భవిష్యత్ ఎలా ఉంటుంది? ఐటీ కంపెనీల్లో ఏయే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీలు ఎంత ఎక్కువ శాలరీలు చెల్లిస్తున్నాయనే అంశాలపై ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో క్రిష్ శంకర్ మాట్లాడారు.
చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక!
ఇటీవల కాలంలో ఉద్యోగుల జీతాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై ‘ గతంలో ఐటీ కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగికి మూడేళ్ల తర్వాతగాని జీతభత్యాలు 50 శాతం పెరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ రంగం వృద్ధి సాధించడంతో ట్రైనీల జీతాలు మూడేళ్లలో 90 శాతం పెరుగుతున్నాయని’ చెప్పారు.
తక్కువ జీతం తీసుకునే వారి సంఖ్య తగ్గి
అదే విధంగా ఐటీ రంగంలో వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీలు భారీ ఎత్తున శాలరీ ప్యాకేజీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్రెషర్‌గా ఐటీ ఉద్యోగంలో చేరిన డిజిటల్ ఇంజినీర్, పవర్ ప్రోగ్రామర్స్ ఇలా వివిధ రకాలైన రోల్స్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, వారి జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని అన్నారు. రూ.3.5 లక్షల ప్యాకేజీ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పవర్ ప్రోగ్రామర్స్ రూ.6.2లక్షలు, డిజటల్ ఇంజినీర్లు రూ.9 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
4ఏళ్లకే ప్రమోషన్లు
జీతాలతో పాటు వేగంగా ప్రమోషన్లు తీసుకుంటున్నారని, కంపెనీలో జేఎల్4 ((job level 4)టెక్నాలజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి నాలుగేళ్లలో పదోన్నతులు లభిస్తున్నాయి. గతంలో ప్రమోషన్లు రావాలంటే కనీసం 7 నుంచి 8 సంవత్సరాలు పట్టేదని కృష్ణశంకర్ పేర్కొన్నారు.
బ్రిడ్జ్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా?
ఫ్రెషర్సే కాకుండా సంస్థలో పనిచేస్తూ ఎక్కువ శాలరీ కోసం వేరే కంపెనీలో చేరేందుకు ఇష్టపడుతున్న వారికి, లేదంటే ఉన్న ఫీల్డ్‌ను వదిలేసి మరో ఫీల్డ్‌లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నవారికి ‘ఇన్ఫోసిస్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నట్లు క్రిష్ శంకర్ వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అర్హులైన ఉద్యోగులు భారీ ప్యాకేజీలు, ప్రమోషన్‌లు దక్కించుకుంటున్నారని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారికి స్కిల్స్ ఉంటే రెండేళ్లలో పదోన‍్నతి పొందవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ
ఇక ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌లో అర్హులైన ఉద్యోగులకు ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై తర్ఫీదు ఇస్తున్నామని, డిమాండ్ ఆధారంగా ఉద్యోగులకు ఆ టెక్నాలజీలో నైపుణ్యం సంపాదించేందుకు తోడ్పాటునందిస్తున్నట్లు ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ శంకర్ స్పష్టం చేశారు.
చదవండి👉 మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం!
Comments
Please login to add a commentAdd a comment