పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఫస్ట్: కేటీఆర్ | Hyderabad to be made top destination for IT sector, says Minister KTR | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఫస్ట్: కేటీఆర్

Published Tue, Mar 15 2016 7:56 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఫస్ట్: కేటీఆర్ - Sakshi

పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఫస్ట్: కేటీఆర్

తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లోని పెట్టుబడి అవకాశాలపై దేశంలోని ప్రముఖ మౌళిక వసతుల, నిర్మాణ కంపెనీలతో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లోని పెట్టుబడి అవకాశాలపై దేశంలోని ప్రముఖ మౌళిక వసతుల, నిర్మాణ కంపెనీలతో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టుల ప్రణాళికలను మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖల వారీగా మంత్రి అయా కంపెనీల ప్రతినిధులకి వివరించారు. దేశంలోని సూమారు 25 ప్రముఖ నిర్మాణరంగ కంపెనీలు ఈ సమావేశానికి హజయ్యాయి.

ముఖ్యంగా ఈసారి బడ్జెట్ లో పెట్టిన పలు ప్రాజెక్టుల తాలుకు వివరాలతోపాటు ప్రభుత్వం అయా ప్రాజెక్టుల పై పెద్ద ఎత్తున నిధులను  ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పారదర్శక విధానాలను వివరించి పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకి ప్రభుత్వం తరపున పూర్తి స్ధాయి సహకారం ఉంటుందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందన్నారు. పరిశ్రమలకి కావాల్సిన స్ధలం, సహకారం విషయంలో ఎలాంటి కొరత లేదని, వేగంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ  పారిశ్రామిక విధాన తోడ్పడుతుందన్నారు. ఇక పరిశ్రమల స్ధాపనకి ముందుకు వచ్చే వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాలు కల్పిస్తున్నదని మంత్రి తెలిపారు.


ఐటి రంగంలో హైదరాబాద్ త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. దేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ పెరుగుదల రేటు 13 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 16 శాతంగా ఉన్నదన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు గూగుల్, మైక్రోసాస్ట్, యాపిల్ , అమెజాన్ వంటి కంపెనీలు అతిపెద్ద క్యాంపస్లను నగరంలో నిర్మించేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. నగరం చుట్టుపక్కలా ఐటి పార్కులు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పలు మెబైల్, టివి, ఎల్ఈడీ తయారీదారులు ముందుకు వచ్చారన్నారు.  మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి నగరంలో నిర్మించబోయే రోడ్లు (SRDP), మూసీ ప్రక్షాళన వంటి ప్రణాళికలను పరిశ్రమల ప్రతినిధులకి పరిచయం చేశారు.

తాము పరిచయం చేసిన ప్రభుత్వ ప్రాజెక్టు ప్రణాళికలపై ఆసక్తి ఉన్న కంపెనీలతో తమ అధికారులు ప్రత్యేకంగా చర్చిస్తారని, అవసరమైతే ముఖ్యమంత్రిని సైతం వారికి కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో కలిసి రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆయా సంస్ధలను కోరారు.  ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ యంజి గోపాల్, ఇందన, ఐటి శాఖల కార్యదర్శులు యచ్ యండిఏ, జియచ్ యంసి కమిషనర్లు, మున్సిపల్ శాఖ కమిషనర్, నగర మేయర్ బొంతు రామ్మెహన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement