న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో డేటా భద్రత అంతంత మాత్రమేనా..? అమెరికాకు చెందిన డేటా సెక్యూరిటీ సంస్థ ‘రుబ్రిక్’ నిర్వహించిన సర్వేలో ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పిన మాటలు వింటే నిజమేనని అనిపిస్తోంది. తమ కంపెనీ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్టు భారత్‌లో 49 శాతం ఐటీ కంపెనీలు చెప్పడం గమనార్హం. తమ వ్యాపార డేటాపై సైబర్ దాడులు జరిగినట్టు పేరొందిన బ్రాండ్లు ప్రస్తావించాయి. అంతేకాదు వచ్చే 12 నెలల కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయే రిస్క్ అధికంగా ఉందని 30 శాతం సంస్థలు చెప్పాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సంస్థలకు గాను ఒక సంస్థ గడిచిన ఏడాది కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయినట్టు చెప్పడం గమనార్హం. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్, భారత్‌లో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 11 మధ్య ఈ సర్వే జరిగింది. గడిచిన ఏడాది కాలంలో ఒకటికి మించిన సార్లు డేటా చోరీ జరిగినట్టు ప్రతి ఆరు సంస్థలకు గాను ఒకటి చెప్పింది. డేటా భద్రత విషయంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ అధ్యయనం మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. కృత్రిమ మేథ (ఏఐ)తోపాటు క్లౌడ్ అధునాతన సైబర్ భద్రత విషయంలో అవకాశాలు కల్పిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది.
దాడులను ఎదుర్కొనే సన్నద్ధత
భారత్‌లో 54 శాతం ఐటీ కంపెనీలు సైబర్ నేరస్థుల చర్యలు తమ సంస్థ డేటాకు రిస్‌్కగా పేర్కొన్నాయి. వీటిలో 34 శాతం సంస్థలు సైబర్ దాడుల రిస్‌్కను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. ఏఐను అమలు చేయడం వల్ల సున్నిత డేటాను కాపాడుకోవచ్చని 54 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఎలాంటి ప్రభావం చూపించదని 24 శాతం కంపెనీలు అభిప్రాయం తెలియజేశాయి. ‘‘డేటా చోరీ వ్యాపారాలను నిరీ్వర్యం చేయగలదు. అందుకని డేటాను కాపాడుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అది సైబర్ దాడులను కాచుకుని వ్యాపారం స్థిరంగా కొనసాగేలా ఉండాలి’’అని రుబ్రిక్ జీరో ల్యాబ్స్ హెడ్‌స్టీవెన్ స్టోన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment