వాషింగ్టన్: టిక్‌టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు.
గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment