under 18
-
టిక్‌టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్‌టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
గూగుల్ నుంచి ఆ ఫొటోలూ డిలీట్ చేయొచ్చు
గూగుల్ సెర్చ్ బార్లో ఓసారి మీ పేరు టైప్ చేసి చూడండి. గూగుల్ ఇమేజ్‌ల్లో మీ ఫొటో కనిపించే అవకాశం లేకపోలేదు. సోషల్ మీడియా కనెక్టివిటీ అయితేనేం.. ట్యాగ్ చేసినవి అయితేనేం.. రివెంజ్‌తో అప్లోడ్ చేసేవి అయితేనేం.. ఇతరత్ర డేటా వల్ల అయితేనేం.. గూగుల్‌లో మన ఫొటోలు కనిపించడం షరామామూలు అయ్యింది. అయితే ఇష్టం లేకున్నా.. అభ్యంతరాలున్నా మీ ఫొటోల్ని డిలీట్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్న గూగుల్.. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని పిల్లల కోసమూ తీసుకురాబోతోంది. ఈ మధ్య కాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకం సర్వసాధారణం అయ్యింది. ఈ తరుణంలో 13-18 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది గూగుల్. 18 ఏళ్లలోపు యూజర్లుగానీ, వాళ్ల తల్లిదండ్రుల విజ్ఞప్తి మీద గూగుల్ ఇమేజెస్‌లో కనిపించే ఫొటోల్ని డిలీట్ చేసే వీలును గూగుల్ కల్పిస్తోంది. ఇలాంటి ఆప్షన్ పెద్దల కోసం ఇదివరకే ఉంది. అయితే ఈ వ్యవహారంలో అశ్లీల కంటెంట్, వేధింపులతో ఎక్కువగా బాధితులు అవుతోంది పిల్లలే. అందుకే ఇప్పుడు కీలక ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఆ ఏజ్ గ్రూప్ యూజర్లు, పేరెంట్స్, సంరక్షకులు ఎవరైనా సరే సంబంధిత ఫీడ్‌బ్యాక్‌ను(కారణం) చెప్పి.. ఆ ఫొటోను తొలగించొచ్చు. ఈ నెలాఖరులో ఈ సౌకర్యాన్ని తీసుకురాబోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి పేరెంట్ గైడ్‌లైన్స్ వివరాలను ఉంచింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులకు భారీ షాక్! ఇక 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది టెక్ దిగ్గజం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పెద్ద మెలిక కూడా ఉంది. గూగుల్ తన ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ నుంచి మాత్రమే ఫొటోను తొలగిస్తామని స్పష్టత ఇచ్చింది. అంటే.. గూగుల్ ఇమేజ్‌ల నుంచి ఫొటో పోయినా.. ఇంటర్నెట్ డేటా(మిగతా వెబ్ బ్రౌజర్ల) నుంచి మాత్రం ఆ ఫొటో పోతుందన్న గ్యారెంటీ లేదు. -
క్రికెట్లో బౌన్సర్లను నిషేధించాలి..
లండన్: జూనియర్ స్థాయి క్రికెట్లో బౌన్సర్లను నిషేదించేందుకు క్రికెట్ వర్గాలు కృషి చేయాలని ప్రముఖ కంకషన్ వైద్యుడు మైఖేల్ టర్నర్ పిలుపునిచ్చాడు. బౌన్సర్లు సంధించే క్రమంలో బంతి తలకు బలంగా తగిలితే యువ క్రికెటర్లు కంకషన్‌కు(అపస్మారక స్థితి) గురయ్యే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్త వయసు క్రికెటర్లను బౌన్సర్ల బారి నుంచి కాపాడే బాధ్యత క్రికెట్ చట్టాల రూపకర్తలపై ఉందని, అందుకు వారు సానుకూలంగా స్పందించి సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్లాట్ పిచ్‌లపై నుంచి నిప్పులు చెరుగుతూ దూసుకొచ్చే బంతులు యువ క్రికెటర్ల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. బౌన్సర్ల బారి నుండి కాపాడేందుకు అత్యాధునిక హెల్మెట్లు అందుబాటులో ఉన్నా, బంతి వేగం ధాటికి అవి తునాతునకలు కావడం చాలా సందర్భాల్లో గమనించామని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్లను.. అందులోనూ జూనియర్ స్థాయి క్రికెటర్లను కంకషన్ బారి నుండి కాపాడాలంటే బౌన్సర్లను నిషేదించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన నాటి నుండి క్రికెట్లో బౌన్సర్లపై నిషేదం అన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. ఆతరువాత కూడా చాలా సందర్భల్లో బంతి తలకు తాకడం వల్ల క్రికెటర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనలు చాలా చూశాం.. ఇది చాలా ప్రమాదకర హెచ్చరిక అని టర్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. -
ప్రి క్వార్టర్స్‌లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ముందంజ వేసింది. పుణేలోని బాలేవాడి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. బాలికల సింగిల్స్ తొలిరౌండ్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6-3, 6-1తో కె. విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. -
పాక్‌పై భారత్ గెలుపు
ఢాకా: అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో దాయాది పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా గురువారం ఢాకాలో జరిగిన పోరులో భారత్ 3-1 తేడాతో పాక్‌ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ పై ఎదురుదాడికి దిగిన భారత్ సానుకూల ఫలితాన్ని రాబట్టింది. మ్యాచ్ ప్రథమార్థంలో 2-0 తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన భారత్..ఆ తరువాత మరో గోల్ సాధించింది. అయితే మ్యాచ్ చివరి పది నిమిషాల్లో ముగుస్తుందనగా పాకిస్తాన్ ఒక గోల్ సాధించడంతో భారత్ కు 3-1 తో విజయం లభించింది. -
శ్రీవల్లి రష్మిక జోడికే డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీవల్లి రష్మిక జోడి విజేతగా నిలిచింది. మారిషస్‌లో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక (భారత్)- కేటీ లాఫ్రాన్స (అమెరికా) జోడి 3-6, 6-4, 10-6తో అమిలియా - జరా లినెన్ జంటపై విజయం సాధించింది. తుదిపోరులో తొలిసెట్లో తడబడిన రష్మిక జోడి తర్వాత రెండు సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. -
ఫైనల్లో శ్రీవల్లి -రష్మిక జోడి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీవల్లి రష్మిక జోడి ఫైనల్‌కు చేరుకుంది. మారిషస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల డ బుల్స్ సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్)-కేటీ లాఫ్రాన్స్ (అమెరికా) జోడి 4-6, 7-5, 10-8తో స్నేహల్ మణె (భారత్)-వెరొనికా (పొలాండ్) జంటపై విజయం సాధించింది. టాప్‌సీడ్ జోడి చేతిలో తొలి సెట్ కోల్పోయిన రష్మిక జోడి తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించింది.