పాక్పై భారత్ గెలుపు
ఢాకా: అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో దాయాది పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సెమీ ఫైనల్లో భాగంగా గురువారం ఢాకాలో జరిగిన పోరులో భారత్ 3-1 తేడాతో పాక్ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ పై ఎదురుదాడికి దిగిన భారత్ సానుకూల ఫలితాన్ని రాబట్టింది.
మ్యాచ్ ప్రథమార్థంలో 2-0 తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచిన భారత్..ఆ తరువాత మరో గోల్ సాధించింది. అయితే మ్యాచ్ చివరి పది నిమిషాల్లో ముగుస్తుందనగా పాకిస్తాన్ ఒక గోల్ సాధించడంతో భారత్ కు 3-1 తో విజయం లభించింది.