One Hour
-
టిక్‌టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్‌టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్‌వో జూన్ 1న ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ♦ రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ♦ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ♦ అతడు, లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని జమచేస్తారు. ♦ ఈపీఎఫ్‌వో బోర్డు మే నెలలో జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్‌కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో మొత్తం ఫండ్‌లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. -
రాజ్యసభ గంటపాటు వాయిదా
న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌పై మంగళవారం రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్‌లో దూసుకు వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఛైర్మన్ స్థానంలో ఉన్న పి జె కురియన్ మీ స్థానాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనకు మిగతా ప్రతిపక్ష సభ్యులు మద్దతు తెలిపారు. దాంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే సదరు బీజేపీ నేతల రాజీనామాపై కాంగ్రెస్ పట్టుపట్టింది. అందుకు అధికార బీజేపీ ససేమిరా అంది. దాంతో సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై లోక్ సభ స్పీకర్ 5 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేటు వేశారు. అందుకు నిరసనగా రాజ్యసభలో ఎంపీలు ఆందోళనకు దిగారు. -
ఎంసెట్.. గంట ముందే హాల్లోకి
-
ఎంసెట్.. గంట ముందే హాల్లోకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. ఈసారి పరీక్ష రోజున విద్యార్థులను హాల్లోకి గంట ముందుగానే అనుమతించనున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోరని స్పష్టం చేశారు. విద్యార్థులకు అరగంట ముందుగానే ఓఎంఆర్ జవాబు పత్రాన్ని అందజేస్తామని, సూచనలను జాగ్రత్తగా చదివి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఒకసారి పెన్నుతో రాసిన తరువాత దిద్దుబాటుకు అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని వివరాలను నమోదు చేయాలన్నారు. పరీక్ష సమయానికి 5 నిమిషాల ముందు బుక్లెట్ ఇస్తారని తెలిపారు. ఎంసెట్ కన్వీనర్ ‘సాక్షి’కి వెల్లడించిన మరిన్ని అంశాలు.. ఎంసెట్‌కు రూ. 10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఆదివారంతో ముగిసింది. పరీక్ష నిర్వహణకు 16,600 మంది సిబ్బందిని నియమించారు. 800 మంది అబ్జర్వర్లు, 50 స్పెషల్ అబ్జర్వర్లు ఉంటారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష కేంద్రాల్లో 227 మంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుంది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు, ఇప్పటికే కాలేజీల్లో చేరి మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారు, 2012కు ముందు ఎంసెట్ రాసి మళ్లీ మళ్లీ రాస్తున్న వారిపై నిఘా పెట్టారు. వారి సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేశారు. విద్యార్థులకు సూచనలు... 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గం టలకు వరకు అగ్రికల్చర్ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో విద్యార్థులు టాయిలెట్‌కు కూడా పరీక్ష హాల్లోకి రావడానికి ముందుగానే వెళ్లి రావాలనే నిబంధన విధించారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ప్రింట్‌ను పరీక్ష హాల్లో అందజేయాలి. నెగిటివ్ మార్కుల విధానం ఉండదు. కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు ఏమీ లేనందున వారు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి. పరీక్ష హాల్లోకి తీసుకు రాకపోతే జూన్ 1లోగా ఎంసెట్ కార్యాలయంలో సమర్పించాలి. ఎంసెట్ పరీక్షా కేంద్రాలు: 750 ఇంజనీరింగ్ : 527 మెడికల్ : 227 ఇంజనీరింగ్ దరఖాస్తులు : 2,81,695 విద్యార్థులు : 1,75,365 విద్యార్థినులు : 1,06,330 మెడికల్ అండ్ అగ్రికల్చర్ : 1,11,777 విద్యార్థులు : 40,879 విద్యార్థినులు : 70,898 రెండిటికీ దరఖాస్తు చేసిన వారు : 1,071 -
కాక్టైల్ కింగ్..
కేర్‌ఫుల్‌గా కాక్టైల్ రెడీ చేస్తున్న ఈ బార్టెండర్ పేరు షెల్డన్ వైలీ. ఇతనికి కాక్టైల్ కింగ్ అని పేరు. అందుకే మంగళవారం న్యూయార్క్‌లోని బౌన్స్ స్పోర్టింగ్ క్లబ్లో కేవలం గంట వ్యవధిలో ఏకంగా 1,905 కాక్టైల్స్ తయారుచేశాడు. అదీ ఏ వెరైటీ రిపీట్ కాకుండా.. దీంతో గిన్నిస్ బుక్వాళ్లు కూడా షెల్డన్ ప్రతిభకు మెచ్చేసి.. ఈ విభాగంలో ప్రపంచ రికార్డును అతడికి కట్టబెట్టేశారు. -
సభ్యుల నిరసనలతో అసెంబ్లీ గంట వాయిదా
విపక్షాల నిరసనల మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడ్డాయి. గురువారం సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. నేడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభకు రానున్న ఈ నేపథ్యంలో ఇరుప్రాంత సభ్యులు సభలో తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు. దాంతో వారిని ఎంత వారించిన వినకపోవడంతో శాసనసభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు విద్యుత్ చార్జీల పెంపు, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేసింది. విద్యుత్ కోత, తాగు నీటి కొరతపై ఎంఐఎం, అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల పెంపుపై సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా ద్రవ్య వినిమయ బిల్లును నేడు శాసనసభ ఆమోదించనుంది. అయితే గత రెండేళ్ల ప్రభుత్వ వ్యయాలపై ఆడిట్ రిపోర్టులను కాగ్ సభ ముందు ప్రవేశపెట్టింది. -
వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్
-
నిరసనలు, నినాదాలు, సభ వాయిదా
-
శాసనసభ గంటపాటు వాయిదా
-
అసెంబ్లీ గంట వాయిదా
-
అసెంబ్లీ గంట వాయిదా
-
పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన సభ
-
జై సమైక్యాంధ్రతో దద్దరిల్లిన అసెంబ్లీ, గంట వాయిదా
-
వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్, అసెంబ్లీ వాయిదా
-
శాసనసభ సమావేశాలు గంటపాటు వాయిదా