భారతదేశంలో టిక్‌టాక్(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ.. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చైనా యాప్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఇటీవల అమెరికా దీనిపై నిషేధం విధించింది. దీంతో చాలామంది యూజర్లు.. ఇకపై టిక్‌టాక్ ఉండదని, యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మళ్ళీ వారు ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. కాగా ఈ యాప్ ఉన్న ఫోన్‌ల ధరలు యూఎస్ఏలో భారీగా పెరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. టిక్‌టాక్ యాప్ ఉన్న 'ఐఫోన్ 15 ప్రో 125 జీబీ' మోడల్ ధర 5 మిలియన్ డాలర్లు (రూ. 43కోట్లు) అని తెలుస్తోంది.
నేను టిక్‌టాక్ తొలగించాను.. ఇప్పుడు దానిని ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నాను. టిక్‌టాక్ యాప్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నవాళ్లు.. ఎవరైనా విక్రయించదలిస్తే.. వారికి 5000 డాలర్లు (రూ. 4.3 లక్షలు) ఇస్తాను అని ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
I deleted TikTok and now I can’t get it back! I will pay someone $5,000 for an iPhone 16 Pro Max with TikTok still installed. DM me.
— Terrell from Sales (@Terrell_2_Cold) January 20, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే.. అమెరికా ప్రజలు టిక్‌టాక్‌కు ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఒక్క యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు.
ఇదీ చదవండి: ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండి
నిజానికి జనవరి 19న టిక్‌టాక్ నిషేధం అమల్లోకి వచ్చింది. కానీ 12 గంటల్లోనే ఆ నిషేధం ఎత్తివేశారు. అప్పటికే ఈ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నవారు.. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత యూఎస్ చట్టపరమైన కారణాల కారణంగా డౌన్‌లోడ్ కావడం లేదు. దీంతో మళ్ళీ టిక్‌టాక్ పొందటానికి.. యాప్ ఉన్న మొబైల్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
This is INSANE! eBay is full of phones with TikTok already downloaded on it selling for thousands!! pic.twitter.com/juxXtINQ9z
— Gentry Gevers (@gentrywgevers) January 22, 2025
Comments
Please login to add a commentAdd a comment