ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధర ఎంత ఎక్కువ ఉన్నా ప్రజలు ఐఫోన్‌కే మొగ్గు చూపుతారు. అంతటి చరిత్ర ఉన్న ఈ బ్రాండెడ్ కంపెనీకు అంతర్జాతీయంగా ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి ఐఫోన్ వాడకంలో రష్యా ప్రభుత్వం జంకుతోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఐఫోన్ ఉపయోగించకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటంటే...
ఐఫోన్‌ల వాడకం నిషేధించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం.. యాపిల్ అమెరికాకు చెందిన సంస్థ కావడం, దీంతో అక్కడి కంపెనీలు తమపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయనే రష్యాన్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ .. తమ అధికారులకు ఇదివరకే ఈ మేరకు ఆదేశాలు జారీచేయగా, తాజాగా అక్కడి వాణిజ్యశాఖ కూడా ఐఫోన్లను వాడవద్దని ఉద్యోగులను ఆదేశించింది. అమెరికా తమ ఉత్పత్తులతో హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశం ఉందంటూ మార్చిలో యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని అధికారులను ఆదేశించగా.. తాజాగా దీని అమలును మరింత సీరియస్‌గా తీసుకుంది.
అమెరికన్లు తమ పరికరాలను వైర్ ట్యాపింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తమ అధికారులు విశ్వసిస్తున్నారని" రష్యా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నిపుణుడు ఆండ్రీ సోల్డాటోవ్ తెలిపారు. ఇదిలా ఉండగా... ఉక్రెయిన్‌తో రష్యా యుధ్దం ప్రారంభించిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ, ఆర్థిక రంగాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌నే వినియోగించాలనే నిర్ణయంపై పుతిన్ సంతకం చేశారు. ఈ క్రమంలోనే యాపిల్ ఉత్పత్తుల వాడకంపై అనధికారిక నిషేధం విధించి ఉండచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment