సాక్షి, బెంగళూర్: భారత ఐటీ పరిశ్రమ సత్తాపై అంతర్జాతీయ విపణిలో విశ్వాసం కొనసాగుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ అన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌తో టీసీఎస్ ఒప్పందం భారత ఐటీ పరిశ్రమ పట్ల క్లెయింట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని నిరూపించిందని చెప్పారు. తమ సాంకేతిక పనుల కోసం భారత ఐటీ పరిశ్రమపై ఆధారపడిన అంతర్జాతీయ సంస్థలు తమ డిజిటల్ కార్యకలాపాలనూ భారత్‌కే ఆఫర్ చేయడం కొనసాగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సంప్రదాయ టెక్నాలజీలపై వెచ్చించే భారత ఐటీ పరిశ్రమ క్లెయింట్‌లు క్రమంగా డిజిటల్ కార్యకలాపాలను భారత కంపెనీలకు మళ్లిస్తారని అభిప్రాయపడ్డారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీలపై సేవలు అందించేందుకు భారత ఐటీ సేవల పరిశ్రమ సంసిద్ధంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు గత ఏడాది తమ ఆదాయాల్లో 17 నుంచి 22 శాతం డిజిటల్ టెక్నాలజీ సేవల ద్వారానే ఆర్జించాయి.
Comments
Please login to add a commentAdd a comment