heavy loss
-
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
నష్టంలో హైదరాబాద్ మెట్రో
-
రూపాయి చరిత్రాత్మక పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది. ► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. 74.70 గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది. ► భారత్ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి. ► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ► కోవిడ్–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 103 దాటేయడం గమనార్హం. ► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది. ► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన. -
కఠిన ‘హెచ్–1బీ’తో అమెరికాకూ నష్టమే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల జారీ విధానంలో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు భారత కంపెనీలపైనే కాకుండా అమెరికా ఐటీ పరిశ్రమపైనా పెను ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. కఠిన నిబంధనల ప్రభావం అమెరికా ఐటీ రంగం, ఆర్థిక వ్యవస్థపై ఇలా ఉంటుంది. హెచ్ –1బీ వీసాను అధికంగా వినియోగించుకుంటున్నది టెక్ కంపెనీలే. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్లకే గతేడాది ఎక్కువ వీసాలు దక్కాయి. కొత్త నిబంధనల వల్ల అవి విదేశీ నిపుణులను నియమించుకోవడం కష్టతరమవుతుంది. కనీసం బిలియన్ డాలర్ల పెట్టుబడితో విదేశీయులు స్థాపించే సంస్థలు సగటున 760 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వలసదారులకు అడ్డంకులు ఎదురైతే దేశ వాణిజ్య రంగానికి విఘాతమే. అమెరికాలో ఇంజినీరింగ్ చదివే వారిలో విదేశీయులే ఎక్కువ. 70 శాతానికి పైగా కంపెనీల్లో మేనేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో వలసదారులదే ముఖ్య పాత్ర. 2017లో టాప్–7 భారత ఐటీ కంపెనీలకు వీసాలు తక్కువ వచ్చాయి. దీంతో అమెరికాలో నిపుణులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. -
12 ఇళ్లు దగ్ధం: రూ.5 లక్షల నష్టం
సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. కూనేరు పంచాయతీ పరిధిలోని రేగిలపాడు గిరిజన గ్రామంలో 12 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గిరిజన కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
11 ఇళ్లు దగ్ధం: రూ.6 లక్షల నష్టం
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక థామస్‌పేట కాలనీలో అగ్నిప్రమాదం జరిగి 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంతో 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
15 ఇళ్లు దగ్ధం...70 మేకలు సజీవదహనం
సాక్షి, విజయనగరం: భోగాపురం పంచాయతీ వనుంపేటలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 15 ఇళ్లు దగ్ధం కాగా, మంటల్లో చిక్కుకుని 70 మేకలు సజీవదహనమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ అస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాగా తిరుగుబాటుదారులపై పంజా
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంత తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దులో బుధవారం వేకువ జామున భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడుల్లో ఎన్ఎస్సీఎన్–కే భారీగా నష్టపోయినట్లు తూర్పు కమాండ్ ప్రకటించింది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమకెలాంటి నష్టం వాటిల్లలేదని ఎన్ఎస్సీఎన్–కే పేర్కొంది. ‘భారత్–మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై ఎన్ఎస్సీఎన్–కే తిరుగుబాటుదారులు ఉదయం 4.45 గంటలకు కాల్పులు జరిపారు. బదులుగా భారత బలగాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తిరుగుబాటుదారులు భారీగా నష్టపోయారు. భారత బలగాలు వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని తూర్పు కమాండ్ ప్రకటించింది. చనిపోయిన లేదా గాయపడిన తిరుగుబాటుదారులెందరో వెల్లడించలేదు. భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని పేర్కొంది. భారత్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు వెలువడిన వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేసింది. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా...‘మయన్మార్ భారత్‌కు మిత్ర దేశం అనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. మాకు అందిన సమాచారాన్నే మీకు తెలియజేస్తాం’ అని బదులిచ్చారు. ముగ్గురు జవాన్లు హతం: ఎన్ఎస్సీఎన్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎన్ఎస్సీఎన్ పీఆర్వో ఇసాక్ సుమి ఈ దాడి గురించి సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. భారత్–మయన్మార్ సరిహద్దుకు 10–15 కి.మీ దూరంలోని మయన్మార్ ఆక్రమిత నాగా ప్రాంతంలోని లాంగ్‌కు గ్రామంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాడు. ‘తమ శిబిరాల వైపు వస్తున్న భారత ఆర్మీని గుర్తించిన నాగా తిరుగుబాటుదారులు తెల్లవారు జామున 3 గంటలకు కాల్పులకు దిగారు. నేను ఈ పోస్ట్ చేసే సమయంలోనూ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి’ అని పోస్ట్ చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు వెల్లడించాడు. తమ వర్గంవైపు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాడు. ఇసాక్ ప్రస్తుతం మయన్మార్‌లోని యాంగాన్‌లో ఉన్నట్లు అతని పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇసాక్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత ఆర్మీ...ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావంది. మణిపూర్‌లో 20 మంది సైనికుల హత్యకు ప్రతీకారంగా 2015, జూన్‌లో కూడా ఆర్మీ ఇలాంటి ఆపరేషనే చేపట్టి వారికి తీవ్ర నష్టం మిగిల్చింది. -
కన్నీరే మిగిలింది
అకాల వర్షం.. అనుకోని రీతిలో గాలులు కలిపి రైతుల ఆశలు ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి మరో పది రోజుల్లో పంట అందుకుందా మని ఆశ పడిన రైతును నిలువునా ముంచేశాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పడిన వర్షానికి, వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయల తోటలు చాలా చోట్ల పాడైపోయాయి. అప్పులు చేసి మరీ పంటకు మదుపులు పెట్టామని, ప్రకృతి వైపరీత్యానికి ఇలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రణస్థలం: అకాల వర్షాలు, ఈదురుగాలులకు వాణిజ్య పంటలు నాశనమైపోయాయి. రణస్థలం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. శుక్రవారం వీచిన ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి, మిరప వంటి వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని సీతంవలస, రావాడ, రణస్థలం, కోష్ట, బంటుపల్లి, లంకపేట, వెంకట్రావుపేట, పాతర్లపల్లి వంటి గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. మిరప విరిగిపోగా, జీడి, మామిడి రాలిపోయాయి. ఈ అకాల వర్షాలకు సుమారు ఎకరాకు రూ.40వేలు వర కు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రూణమాఫీ చేయకపోడంతో పంట వేసిన తరువాత అప్పులు చేసి మదుపులు పెడుతున్నామని చివరకు తీర్చేందుకు కూడా ఫలసాయం రావడం లేదని తెలిపారు. సర్వే చేస్తున్నాం: అకాల వర్షాల వల్ల సుమారు 350 హెక్టార్లలో మొక్కజొన్న నేలకొరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నాం. రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. --- సీహెచ్ కార్తీక సుధ, వ్యవసాయాధికారి, రణస్థలం పూర్తిగా నష్టపోయా: మొక్కజొన్న 2 ఎకరాలు, మిరప 50 సెంట్లలో వేశాను. ఈ పెను గాలులకు పంటలు పూర్తిగా పాడైపోయి నష్టపోయాను. --- కోల దుర్గారావు, రైతు ప్రభుత్వమే ఆదుకోవాలి: మొక్కజొన్న 2.50 ఎకరాలు, మిరప 75 సెంట్ల వరకు సాగు చేస్తున్నాను. ఈదురుగాలుల కు మిరప పిందె కూడా చేతికి రాకుండా మొత్తం పోయింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. --- మాత రామారావు, రైతు రైతన్న కంట నీరు పొందూరు : మండలంలో శుక్రవారం కురిసిన అ కాల వడగళ్ల వర్షానికి పంటలు నాశనమయ్యాయి. ఉద్యానవన, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో రైతన్నలు కన్నీ టి పర్యంతమవుతున్నారు. మండలంలోని బాణాం, తానెం, దళ్లిపేట, రెడ్డిపేట, కంచరాం, లోలుగు, తం డ్యాం, మీసాలపేట, బొట్లపేట, మన్నెపేట గ్రామాల్లో ఉద్యానవన పంటలు, మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. బాణాం, దళ్లిపేట, లోలుగు, తండ్యాం పంచాయతీల్లో మొక్కజొన్న సుమారు 750 ఎకరాల్లో నాశనమైంది. సుమారుగా మిరప– 300 ఎకరాలు, అరటి– 50 ఎకరాలు, వంగ–20 ఎకరాల్లోను నాశనమైంది. బొట్లపేటకు చెందిన రైతులు నాగేశ్వరరావు, ఉప్పలపాటి ధనుంజయలక్ష్మి, మన్నె హైమావతి, బొట్ల సూర్యనారాయణ, సీతారాం, వాండ్రంగి గ్రామానికి చెందిన మేక సుందరనారాయణమ్మ తదితరులకు చెందిన మిరప పంట ధ్వంసమైంది. బాణాంలో మునకాల సత్యం, కొల్లి సత్యనారాయణ తదితరులకు చెందిన బొప్పాయి పంటలు నేలకొరిగాయి. సుమారు 5 ఎకరాల్లో అరటి తోట పువ్వు, కాయ దశలో ఉండగా వడగళ్ల వానకు నేలకొరిగింది. దీంతో పాటు మిరప, బొప్పాయి, వంగ తది తర పంటలు వందల ఎకరాల్లో నాశనమయ్యాయి. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. వారి కష్టం, అప్పు మాత్రమే మిగిలింది. --- పెద్దింటి వెంకటరవిబాబు, సర్పంచ్, బాణాం చేతికొచ్చిన బొప్పాయి పంట చేజారిపోయింది. వడగళ్ల వానకు కాయలు పక్వానికి రాకుండానే రాలపోయాయి. అమ్మితే కొనేవారు కూడా ఉండరు. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. --- మునకాల సత్యం, బొప్పాయి రైతు, బాణాం. తండ్యాం, మీసాల పేట, బొట్లపేట గ్రామాల్లో వేసిన సుమారు 2 ఎకరాల్లో వం గపంట నాశనమైంది. రాత్రి, పగలు కష్టపడి పంటను పండించాం. పిందెæ దశలో ఉండగా పంట మొత్తం నేలకొరిగింది. --- మీసాల రమణబాబు, మీసాల పేట, రైతు నేలమట్టమైన పంటలు లావేరు : మండలంలో శుక్రవారం రాత్రి వడగళ్ల వానతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో మండలంలోని మొక్కజొన్న, బొప్పాయి పంటలు నేలమట్టమయ్యాయి. అలాగే మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి. మండలంలోని కేశవరాయుని పురం, లావేటిపాలేం, లావేరు, సీతంవలస, రామునిపాలేం, తాళ్లవలస, గుమడాం, గోవిందపురం, ఇజ్జాడపాలేం, లింగాలవలస, పోతయ్యవలస, లుకలాపుపేట, కొత్తకోట, అదపాక, బెజ్జిపురం, రావివలస, గుమడాం, బుడతవలస, వేణుగోపాలపురం, నాగంపాలేం గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న పంట ఈదురుగాలులకు బలైపోయింది. అలాగే మండలంలోని పిడుగుపాలేం, లావేటిపాలేం, అప్పాపురం, వెంకటాపురం గ్రామాలతో పా టు మరికొన్ని గ్రామాల్లో బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. వీటితో పాటు మామిడి కాయలు కూ డా చాలా వరకు రాలిపోయాయి. నాలుగు రోజుల కిందట పడిన అకాల వర్షానికి కొం త మొక్కజొన్న పంట నేలమట్టం అవ్వగా శుక్రవారం వీచిన గాలులకు మొత్తం ఒరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అ«ధికారులు, పాలకులు పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. జి.సిగడాంలో..: మండలంలో శనివారం కురిసిన వర్షానికి, వీచిన భారీ గాలులకు రైతు నిలువునా మునిగిపోయాడు. వాండ్రంగి గ్రామంలో చింత సింహాచలం అనే వ్యక్తికి సం బంధించి రూ.1.80 లక్షల విలువ చేసే నూర్పు యంత్రంపై భారీ చెట్టుపడి యంత్రం నాశనమైపోయింది. అదే గ్రామానికి చెందిన మన్నె లక్ష్మిదొరకు చెందిన ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. గ్రామంలో మొక్కజొన్న, మిరప, జీడి, మామిడి తోటలు 25 ఎకరాల వరకు నాశనమయ్యాయని సర్పంచ్ బీవీ రమణ తెలిపారు. ఉల్లివలస, వెంకయ్యపేట, బాతువ గ్రామాల్లో అరటి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి తక్షణమే నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే జరిపి బాధితులను అదుకోవాలని కోరుతున్నారు. కొంప ముంచిన వర్షం: రాజాం రూరల్ : అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో అకాల వర్షంతో పాటు ఈదురుగాలుల కారణంగా కోత దశలో ఉన్న మొక్కజొన్న పంటలు పొగిరి, పొనుగుటివలస, శ్యాంపురం తదితర ప్రాంతాల్లో పంట పూర్తిగా పాడైపోయింది. ఈ ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట నేలకొరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. రాజాం తో పాటు పరిసర మండలాల్లో పూత దశలో ఉన్న మామిడి పిందెలు నేలకొరిగాయి. దీంతో ఈ పంటలను కౌలుకు తీసుకు న్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల పంటపొలాల మీదుగా నీరు ప్రవహించింది. కూలిపోయిన షెడ్లు, పొందూరు: మండలంలోని శుక్రవారం కురి సిన వడగళ్ల వానకు పలు రేకుల షెడ్లు విరి గిపోయాయి. బొట్లపేట, తండ్యాం మెట్ట, ఎ రుకల పేటల్లో రేకుల షెడ్లు ఎగిరిపోయి చె ల్లాచెదురైపోయాయి. బొట్లపేటలో రైతు ఉ ప్పిలి బుల్లిరాజుకు చెందిన ఆవుల షెడ్, వ్యవసాయ పనిముట్లు పెట్టుకొనే షెడ్‌పై రేకులు పూర్తిగా విరిగిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. తండ్యాం మెట్టకు సమీపంలో ఉన్న మడ్డువలస కాలువ రెండో దశ పనులుకు సంబందించి క్యాంపు ఆఫీసుపై రేకులు విరి గిపోయాయి. ఎరుకలపేట సమీపంలోని హో టల్ పైకప్పు పూర్తిగా కూలిపోయింది. -
ఉల్లిరైతు కంట కన్నీరు
-
భారీ ఒడిదుడుకుల్లో మార్కెట్లు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభవాన్ని చూపింది. పెను ఊగిసలాటల మధ్య దేశీయ సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతలోనే 300 పాయింట్ల వరకు కోలుకున్న సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో 22,769 పాయింట్ల దగ్గర, 116 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 6,913 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ గట్టి మద్దతు స్థాయిలకు కింద ట్రేడవుతూ ఇన్వెస్టర్లను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. -
సంక్షోభంలో పొగాకు రైతు
వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో తగ్గిన కొనుగోళ్లు, కానరాని గిట్టుబాటు ధరలు వెరసి పొగాకు రైతును సంక్షోభంలోకి నెట్టాయి. బయ్యర్లతో సమావేశాలు పెట్టి రైతన్నను కాపాడాల్సిన పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో పొగాకు రైతు ఈ ఏడాది భారీ నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పొదిలి-2 కేంద్రం పరిధిలోని కనిగిరి ప్రాంత రైతులు పొగాకు రైతులు వచ్చే ఏడాది పొగాకు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. - ఇళ్లల్లో మగ్గుతున్న బేళ్లు - భారీ నష్టం చవిచూసే ప్రమాదం - లబోదిబోమంటున్న రైతులు - క్రాప్ హాలిడే ప్రకటించిన పొదిలి-2 కేంద్రం రైతులు కనిగిరి జిల్లాలో పొగాకు విక్రయాల్లో సంక్షోభం ఏర్పడడంతో ఆ రైతుల్లో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 11 వేలం కేంద్రాలుండగా వాటికి సంబంధించి 90 మిలియన్ కేజీల అనుమతి ఉండగా, 108 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు అంచనా. పొదిలి వేలం కేంద్రం-2 పరిధిలో 14 మండలాలున్నాయి. ఈ కేంద్రం పరిధిలో 1750 వరకు బ్యారన్లుండగా ఒక్క కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనే 1350 బ్యారన్లున్నాయి. దీనికి సంబంధించి 2,200 మంది పొగాకు లెసైన్స్ రైతులున్నారు. ఈ రైతులు గత ఏడాది 9.4 మిలియన్ కేజీలు పొగాకు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 8.5 మిలియన్ కేజీలు మాత్రమే చేశారు. గత ఏడాది జూన్ నాటికి 4.8 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరగ్గా, ఏడాది జూన్ నాటికి 1.2 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగినట్లు అధికారిక నివేదికలున్నాయి. భారీగా నష్టంవాటిల్లే ప్రమాదం అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు వరకు పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే 45 శాతం పొగాకు అమ్మకాలు జరిగి ఉండాలి . కారణాలు ఏమైనా బయ్యర్లు పొగాకును కొనుగోలు చేసే వాతావరణం కనిపించడం లేదు. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5 మిలియన్ కేజీల అమ్మకాలు జరిగినా, దాదాపు 3.5 మిలియన్ కేజీల పొగాకు నిలిచిపోతోంది. అందులో గ్రేడ్ 1 రకం కనీసం 1.5 మిలియన్ కేజీలుంటుందనేది రైతుల అంచనా. లేదా ప్రస్తుతం గ్రేడ్ 1 రకానికి కేజీకి సరాసరిన రూ.90 నుంచి రూ.108 వరకు ఇస్తున్నారు. దానిని సగం రేటుకు అమ్ముకున్నా నష్టం వస్తుంది. ప్రస్తుతం ఒక్కో రైతు ఇంట్లో 30, 40 బేళ్లు మగ్గిపోతున్నాయి. సరైన గిట్టు బాటు ధరలేక, లోగ్రేడ్ పొగాకు అమ్మకాలు జరగక తీసుకెళ్లిన బేళ్లు వెనక్కి తీసుకుని రావాల్సిందే. ఈ ఏడాది ఒక్కో రైతుకు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. విదేశీ ఆర్డర్లు తగ్గినందునే... దీనిపై ఆక్షన్ సూపరిండెంట్ సత్యన్నారాయణ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా దేశంలో పొగాకు ఉత్పత్తుల వాడకం తగ్గింది. విదేశీ అర్డర్లు తగ్గినందువల్ల బయ్యర్లు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. కనిగిరి ప్రాంత పొగాకు రైతులు వచ్చే ఏడాదికి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ తీర్మానం చేసి వినతి పత్రం ఇచ్చిన విషయం వాస్తవమే. -
మార్చి వరకు సాగర్ నీళ్లివ్వాలి.. గొట్టిపాటి డిమాండ్
ప్రకాశంజిల్లా (అద్దంకి): సాగర్ నీటిని వచ్చే నెల మార్చి నెలాఖరు వరకు ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రులు రైతులకు ఇచ్చినమాటను నిలబెట్టుకోవాలన్నారు. ఇప్పటికిప్పుడు సాగర్ నీరు నిలుపుదల చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని 15 లక్షల ఎకరాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 4.20 లక్షల భూముల్లో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వరి చాలా వరకు కోతకు వచ్చే దశలోనూ, మరి కొంత పొట్ట దశలోనూ ఉందని చెప్పారు. ఆ పంటకు నీరు అవసరమైన కీలక సమయం ఇదేనన్నారు. ఈ సమయంలో ఆంధ్ర రైతుల పొలాలకు నీరు నిలిపేయడం నష్టం కలిగించే చర్యగా ఆభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టి, రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి వెంటనే ఏపీకి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్డు స్పందించకుంటే పోట్లాడైనా నీరు తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సాగర్ ఆయకట్టు ఆంధ్రలోనే ఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రలో సుమారు 15 లక్షల ఎకరాల భూములుంటే, తెలంగాణాలో కేవలం 6.5 లక్షల ఎకరాల సాగు భూమి మాత్రమే ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో సాగర్‌పె మన అధికారుల అజమాయిషీ ఉండాలే కాని, తెలంగాణా అధికారుల అజమాయిషీ ఏమిటని ప్రశ్నించారు. వారు చెప్పినట్టు మనం వినాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రెండు సార్లు సాగర్ నీరు ఆగి మరలా విడుదల కావడంతో పంట భూములు ఎండిపోయి బతికాయన్నారు. మరలా రెండు రోజులు నీటి విడుదల నిలిస్తే, కాలువకు నీరు వచ్చే సమయానికి పంటలు ఎండిపోవడం ఖాయమన్నారు. సుబాబుల్ రైతుల బకాయిలు చెల్లించాలి.. గతంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన సుబాబుల్ కర్ర బకాయిలను కంపెనీల నుంచి చెల్లించే విధంగా సంబంధిత మంత్రి చొరవ చూపాలన్నారు. టన్ను గిట్టుబాటు ధర రూ.4400 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమకు కర్ర దొరకని సమయంలో పొగాకు బదులుగా సుబాబుల్ చెట్లు వేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పిన కంపెనీ ప్రతినిధులు నేడు కర్ర అధికంగా లభిస్తుండడంతో ధరను తగ్గించే ప్రయత్నాలను చేయడం మంచి పద్దతి కాదన్నారు. -
పత్తిమిల్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నర్సయ్యగూడెం వద్ద ఉన్న పత్తిమిల్లులో అగ్నిపమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలియలేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను కారణంగా కొండంత నష్టం జరిగితే చీమంత సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గిద్ది ఈశ్వరి, కళావతి, శ్రీవాణి, సర్వేశ్వరరావు, రాజన్న దొరలు ఈ రోజు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన గిరిజన ప్రాంతాల రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తుపాను వల్ల చనిపోయిన గిరిజన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదని చెప్పారు. తుపాను వల్ల 21వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ సహాయక చర్యలకు మాత్రం 244 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. -
హుదూద్ నష్టం రూ. 65 వేల కోట్లు!?
ప్రభుత్వ, ప్రైవేటు, సేవా రంగాల ఆస్తులకు కలిగిన నష్టం విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలను కుదుపు కుది పేసిన హుదూద్ తుపాను కలిగించిన నష్టం అంచనాలకు అందకుండా ఉంది. నష్టా న్ని అంచనాకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తోంది. కాగా హుదూద్ వల్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, సేవా రంగ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టంపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. తుపాను వల్ల విశాఖపట్నంతోపాటు నాలుగు జిల్లాల్లో 44 మండలాలు దెబ్బతిన్నాయి. అన్నింటా కలిపి దాదాపు రూ.65వేలకోట్లకుపైగా భారీ నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. -
38కి చేరిన తుపాను మృతుల సంఖ్య
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తొలుత పెద్దగా ప్రాణం నష్టం జరగలేదని అంచనా వేసినా.. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. దీంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లింది. రెండు లక్షల 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే 24 చోట్ల కాల్వలకు గండిపడి అపారంగా పంట నష్టం చేకూరింది. ఆ పెను తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ నష్టానికి గురైయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 32, 983 కరెంటు స్తంభాలు భూస్థాపితం కాగా, 181 బోట్లు గల్లంతైయ్యాయి. దీంతో పాటు 16 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. -
హుదూద్ తుపాను విధ్వంసం వివరాలు
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను నష్టం వివరాలను అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రను కుదిపేసిన ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తుపాను అతలాకుతలం చేసింది. పెనుగాలులకు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. షోరూమ్‌లో నుంచి కారు కూడా ఎగిరి కిందపడింది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. మూడు జిల్లాలలో 38 మంది మృతి చెందారు. 8742 పశువులు మృతి చెందాయి. అధికారులు తెలిపిన ప్రాధమిక అంచనా ప్రకారం 11, 318 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. లక్షా 82వేల 128 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. 219 చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. 2250 కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆరు బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. 12,138 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. ** -
హుదూద్ దెబ్బకు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర!
హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటకు 190 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన పెను గాలులు బీభత్సం సృష్టించాయి. తుపాన్ గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం కూడా మూగబోయింది. భారీ వర్షంతో కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. తుపాన్ హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. తుపాను ధాటికి విశాఖ హార్బర్ గజగజ వణికింది. 60 పెద్ద పెద్ద బోట్లను సైతం తుపాన్ తిప్పికొట్టింది. మర బోట్లు జెట్టిపైకి కొట్టుకు వచ్చాయి. ఒక్కో మరబోటు విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. ఆర్కే బీచ్ ధ్వంసం అయింది. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. సముద్రంలో ఇంతటి బీభత్సాన్ని తాము ఇంతవరకు చూడలేదని మత్స్యకారులు చెప్పారు. తుపాన్ ధాటికి విశాఖ విలవిల్లాడిపోయింది. భారీ వృక్షాలు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అపార్ట్మెంట్లకు పగుళ్లు వచ్చాయి. తుపాన్ తాకిడికి రోడ్లు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు కోతలకు గురయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుపాను పూర్తిగా తీరం దాటింది. పూడిమడక గ్రామం వద్ద తుపాను తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో పూడిమడక గ్రామం వద్ద అల్లకల్లోలం సృష్టించింది. తుపాను బలహీనపడిన తరువాత అల్పపీడనంగా మారుతుందని ఐఎండి తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలోని గాలిమొగ అడవులలలో 16 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఈ జిల్లాలోని కర్రపాలెం, లోలూరు, కొత్తూరు గ్రామాలలో ఇళ్లలోకి, ప్రభుత్వ పాఠశాలలలోకి నీరు వచ్చిచేరింది. శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింది. జిల్లాలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు వేలాది ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. . భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. కళింగపట్నం, పొన్నాడలంక, బందరువానిపేట వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. కళింగపట్నం రోడ్లపై చెట్లు కూలాయి. రహదారి మొత్తం మూసుకుపోయింది. శ్రీకాకుళం- పాలకొండ, శ్రీకాకుళం-కళింగపట్నం, శ్రీకాకుళం -రాజాం రహదారులపై కూడా భారీగా చెట్లు నేలకూలాయి. ఈ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సంతబొమ్మాళి మండలం సి.పురంలో తాటిచెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. ఆర్మీ, నేవీ, రక్షణ బలగాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ** -
53 మంది మృతి: రూ.3,756 కోట్లు నష్టం
హైదరాబాద్: భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 53 మంది మృతి చెందారు. ఆరుగురు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది చనిపోయారు. నల్గొండలో ఏడుగురు, మహబూబ్‌నగర్‌లో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు మొత్తం 42,071 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే 12వేల ఇళ్లు కూలిపోయాయి. 2,20,245 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 384 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11లక్షల 37వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1786 పశువులు మృతి చెందాయి. 1,409 చెరువులకు గండ్లు పడ్డాయి. 1500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 3,756 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా, కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీవర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. 16 జిల్లాల్లో 567 మండలాల్లో 5,186 గ్రామాలకు వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. -
దిక్కుతోచని స్థితిలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు
హైదరాబాద్: పైలిన్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్లో మరో తుఫాను తాకిడికి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్ని కలగజేశాయి. జిల్లాలోని కవిటిలో అత్యధికంగా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మందస, కంచలిలో 17.1, పలాసలో 15.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో నాగావళి, వంశధార నదుల్లో భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పాత పట్నంలో మహేంద్రతనయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఏడు మండలాల్లో అంధకారం నెలకొంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కూడా అకాల వర్షాలతో సతమతమవుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగుల్తూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. కొన్ని చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణ వీధుల్లో అనేక చోట్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ రోడ్, మెయిన్ రోడ్డు నీట మునిగాయి. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం వీధుల్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీటమునిగాయి. భారీ నష్టం సంభవించింది. అనేక ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి. -
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు-నీట మునిగిన పొలాలు
హైదరాబాద్: సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీటమునిగాయి. భారీ నష్టం సంభవించింది. అనేక ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం పెరిగిపోవడంతో గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రకాశం జిల్లాలో వర్షపాతం అధికంగా ఉంది. జిల్లా అంతటా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 6 గేట్లు ఎత్తివేశారు. 23 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సగిలేరు వాగు ఉప్పొంగిపొర్లుతోంది. ఈ వాగు సమీపంలోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వైఎస్ఆర్ సిపి నేత అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఒంగోలు-చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సింగాయరాయకొండ మండలం సానంపూడి వద్ద ముట్టేరువాగులోకి వరద నీరు వచ్చి చేరింది. వాగు ఉధృతి పెరిగింది. పటికనేనివారిపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పరుచూరు మండలం అడుసుమల్లి గ్రామం వద్ద సాకీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంటూరు, పరుచూరూలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వైఎస్ఆర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కలశపాడు, పోరుమామిళ్లలో భారీ వర్షం కురిసింది. ఇళ్లు నీట మునిగాయి. సగిలేరు డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. 5 గేట్లు ఎత్తివేసి నీటిని వదిలారు. కలశపాడు మండలం రామాపురంలో భారీ వర్షానికి 17 ఇళ్లు నేలమట్టమయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో పెద్దెరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. చోడవరం సమీపంలో బొడ్డేరుకాజ్వే దెబ్బతింది. 200 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవరపల్లి మండలం రైవాడ రిజర్వాయర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో విశాఖ నగరానికి నీటి తరలింపునకు అంతరాయం ఏర్పడింది. విశాఖ జిల్లాలో వర్షపాతం వివరాలు: మందస 17 సెం.మీ పలాసా, సోంపేట, ఇచ్చాపురం 15 సెం.మీ అనకాపల్లి 12 పత్తిపాడు,చోడవరం, కాకినాడ 12 సెం.మీ కళింగపట్నం 11 భీమవరం, తుని, ఎస్‌కోట, కమలాపురం, నర్సాపురం 10 పెద్దాపురం, విశాఖపట్నం, కావలి 10 సెం.మీ విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బొగాపురం మండలం రావాడ పెద్ద చెరువు వద్ద వంతెన కూలింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో 200 ఎకరాల్లో పంట నీట మునిగింది. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబరు 08922 276 888, 1077. కర్నూలు జిల్లా ఆత్మకూరులో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భవనాసి, గుండ్లకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. పాములపాడు మండలం బానుముక్కలలో మొక్కజోన్న పంట వరదకు కోట్టుకుపోయింది. 40 లక్షల రూపాయల వరకు పంటనష్టం జరిగిందని అంచనా. శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్లలో అత్యధికంగా 60.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పత్తి, మిర్చి పంటలకు నష్టమని రైతులు భయపడుతున్నారు. భారీ వర్షాలకు నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్‌పాలెం వద్ద కుప్పగంజివాగు పొంగిపొర్లుతోంది. వినుకొండ వద్ద గుండ్లకమ్మ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలిలో శివారు కాలనీలు జలమయం అయ్యాయి. సత్తెనపల్లి, అచ్చంపేట మధ్యలో వాగు పొంగిపొర్లుతోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
పారాదీప్ పోర్టుకు తీవ్రం నష్టం
భువనేశ్వర్ : ఒడిశాలో పారాదీప్ పోర్టు పై-లీన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. పోర్టుకు వచ్చే దారులపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ అధికారులు 40వేల చెట్లను తొలగించారు. 10 కిలో మీటర్ల వరకు సీ ఛానల్ షిప్పులకు వీలుగాలేదని అధికారులు చెబుతున్నారు. సీ ఛానల్లో ఇంకా ఆరు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తాకిడి వల్ల పలువురు మత్స్యకారులు దారితప్పారు. పారాదీప్‌లో ఏపీకి చెందిన 8 బోట్లు, 80 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. పారాదీప్ ప్రాంతంలో 3వేల మట్టి ఇళ్లు కూలిపోయాయి. -
చిగురుటాకులా వణికిన శ్రీకాకుళం జిల్లా
పై-లీన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎర్రనీళ్లనే పట్టుకుని వాటినే తాగాల్సి వస్తోంది. అధికారులు గానీ, నాయకులు గానీ ఎవ్వరూ తమ వద్దకు రాలేదని, ఎవరికైనా అనారోగ్యం వచ్చినా రోడ్డుమీదకు తీసుకురావడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు అందించాలని కవిటి, కంచిలి, మందస, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల ప్రజలు కోరుతున్నారు. ఎక్కడికక్కడ సెల్‌ఫోన్ టవర్లు పడిపోవడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యింది. ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే, ఈ ప్రాంతం మళ్లీ కోలుకోడానికి కనీసం రెండు రోజులు పట్టేలా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్ల మీద పడిపోయిన చెట్లను తొలగించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని, చెట్లు పెద్దవి కావడంతో గొడ్డళ్లతో నరకడం కూడా సాధ్యం కావట్లేదు. మీడియా వాహనాలను కూడా అవతల పెట్టుకుని, ఇవతలకు కాలి నడకనే రావాల్సి వస్తోంది. మంచి రేటు వస్తుందని కొబ్బరి రైతు ఆశిస్తున్న సమయంలో దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి పంట నేలకొరిగింది. అరటితోటలు అసలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.