హుదూద్ పెను తుపాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తొలుత పెద్దగా ప్రాణం నష్టం జరగలేదని అంచనా వేసినా.. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 38కి చేరింది. దీంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లింది. రెండు లక్షల 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే 24 చోట్ల కాల్వలకు గండిపడి అపారంగా పంట నష్టం చేకూరింది. ఆ పెను తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ నష్టానికి గురైయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 32, 983 కరెంటు స్తంభాలు భూస్థాపితం కాగా, 181 బోట్లు గల్లంతైయ్యాయి. దీంతో పాటు 16 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.