
హుదూద్ తుపాను విధ్వంసం వివరాలు
హుదూద్ పెను తుపాను వల్ల 11,318 ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను నష్టం వివరాలను అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్రను కుదిపేసిన ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తుపాను అతలాకుతలం చేసింది. పెనుగాలులకు ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. షోరూమ్లో నుంచి కారు కూడా ఎగిరి కిందపడింది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. మూడు జిల్లాలలో 38 మంది మృతి చెందారు. 8742 పశువులు మృతి చెందాయి.
అధికారులు తెలిపిన ప్రాధమిక అంచనా ప్రకారం 11, 318 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. లక్షా 82వేల 128 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. 219 చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతింది. 2250 కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆరు బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. 12,138 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి.
**