
భారీ ఒడిదుడుకుల్లో మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభవాన్ని పడవేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభవాన్ని చూపింది. పెను ఊగిసలాటల మధ్య దేశీయ సూచీలు ట్రేడ్ అవుతున్నాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతలోనే 300 పాయింట్ల వరకు కోలుకున్న సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో 22,769 పాయింట్ల దగ్గర, 116 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 6,913 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ గట్టి మద్దతు స్థాయిలకు కింద ట్రేడవుతూ ఇన్వెస్టర్లను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి.