– నొప్పిలేకుండా ఆపరేషన్లు
– మత్తు మందు వినియోగంలో విప్లవాత్మక మార్పులు
– నేడు ప్రపంచ అనెస్తెషియా దినోత్సవం
'భగవంతుడు తను సృష్టించిన మానవున్ని గాఢనిద్రలోకి జారుకునేటట్లు చేసి, అలా నిద్రలో ఉండగా ఆయన శరీరంలోని పక్కటెముకను ఒక దానిని తీసి, దాని నుంచి ఒక స్త్రీని సృష్టించి ఆ మానవునికి తోడుగా ఉంచాడు' అని బైబిల్లో పేర్కొన్నారు. అదే విధంగా అనెస్తీసియాలజిస్టు సైతం రోగిని నిద్రలోకి జారుకునే విధంగా చేసి, శస్త్రచికిత్స తర్వాత మళ్లీ రోగిని పూర్వసి్థతికి తీసుకువస్తాడు. అనెస్తీషియా అనే వైద్యవిధానం నేడు ప్రత్యేక శాస్త్రంగా రూపుదిద్దుకుంది. 1846 అక్టోబర్ 16వ తేదిన డబ్లు్యటీజీ మోర్టాన్ అనే డాక్టర్ మసాచ్యూట్స్ జనరల్ ఆసుపత్రిలో 'ఈధర్' అనే మత్తుమందును మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. ఆదివారం ‘ ప్రపంచ అనెస్తీషియా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం.
- కర్నూలు(హాస్పిటల్
జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, శ్రీశైలం, నందికొట్కూరు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఆపరేషన్లు జరుగుతుంటాయి. వీటన్నింటిలో ఆపరేషన్ థియేటర్లు అక్కడి అనెస్తీషియా విభాగం, వైద్యుల ఆధీనంలో ఉంటాయి. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే సంవత్సరానికి 25వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. మిగిలిన ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 50వేలకు పైగానే ఉంటుంది. అంటే ఏడాదికి అన్ని ఆసుపత్రుల్లో కలిపి 75 వేలకు పైగా రోగులకు ఆపరేషన్లు నిర్వహించడంలో అనెస్తెషియా వైద్యులే కీలక పాత్ర పోషిస్తారు. ఆపరేషన్ థియేటర్లలోనే గాక అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)లో వెంటిలేటర్లు ఉంటాయి. వాటి నిర్వహణ బాధ్యత కూడా ఈ వైద్యులే చూస్తారు. ప్రపంచ అనెస్తీషియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ అనెస్తెటిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేది ఉదయం 7 గంటల కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజవిహార్ వరకు, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం స్థానిక బళ్లారి చౌరస్తాలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో 'పెయిన్ మేనేజ్‌మెంట్' అనే అంశంపై నిర్వహించే కార్యక్రమానికి నెల్లూరులోని సింహపురి హాస్పిటల్ అనెస్తెషియా వైద్యులు డాక్టర్ రాజమోహన్‌రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు.
అనెస్తీషియా–అపోహలు
–శాస్త్ర పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ విభాగంలో రోగి ప్రాణానికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఎంతటి చిన్న ఆపరేషన్ అయినా ఈ ప్రాణాపాయం ఉంటుంది. అందరూ అనుకునేటట్లుగా చిన్న ఆపరేషన్ కాబట్టి ఏం భయం అవసరం లేదని అనుకోవడానికి వీలులేదు.
– మత్తు డాక్టర్ మత్తు మందు ఇవ్వడంలో ఆయన పని అయిపోతుందనే అభిప్రాయం సరైంది కాదు. శస్త్రచికిత్స ముందు రోగిని పరీక్షించి, రోగికి ఆపరేషన్ తట్టుకునే సామర్థ్యం ఉందా అని నిర్దారించుకుని, ఆపరేషన్ సమయంలో అనుక్షణం రోగిని కంటికి రెప్పలా కాపాడి, ఆ తర్వాత ఆ రోగిని పూర్వపుస్థితికి తీసుకుని వచ్చే బాధ్యత అనెస్తీషియా డాక్టర్‌దే.
–మత్తు మందు ఇచ్చేది జబ్బును నయం చేయడానికి కాదు. సర్జన్ శస్త్రచికిత్సకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి, రోగికి నొప్పి లేకుండా ఉంచడానికి మాత్రమే. కావున ముందు రోగి శరీర ధర్మాన్ని అనుసరించి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా పనిచేయవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం సంభవించవచ్చు.
కార్డియోథొరాసిక్‌లో అత్యాధునిక సేవలు : డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, ఏపీ అనెస్తెటెస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రాంతీయ కార్డియోథొరాసిక్ సర్జరీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మాడ్యులర్ ఓటీ అత్యాధునికమైనది. ఈ విభాగంలో గుండె సంబంధిత వ్యాధులు, రక్తనాళాలు పూడిపోయినప్పుడు, గుండెకవాటాలు సరిగా పనిచేయననప్పుడు, పుట్టుకతో గుండెకు రంధ్రాలు ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో మత్తు డాక్టర్ పాత్ర కీలకంగా ఉంటుంది. స్పైనల్ అనెస్తీషియా అంటే మత్తు మందును వెన్నుపాములోనికి పంపించడం. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలో ఆయా భాగాలలో రోగికి నొప్పి తెలియకుండా చేయవచ్చు. రోగి స్పృహ కోల్పోడు. సాధారణంగా గర్భిణిలో నిర్వహించే సిజేరియన్ ఆపరేషన్లకు, ఆర్థోపెడిక్ విభాగంలో కాళ్లకు సంబంధించి గాయాలకు శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.
అనెస్తీషియాలో విప్లవాత్మకమైన మార్పులు: డాక్టర్ శాంతిరాజు, ఏపీ అనెస్తీషియాలజిస్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి
1847లో జేమ్స్ యంగ్ సిమ్సన్ అనే ప్రొఫెసర్ క్లోరోఫామ్ అనే మత్తుమందును కనుగొన్నారు. ఆ తర్వాత ఈ వి«భాగం గణనీయమైన పురోగతిని సాధించింది. 1917లో బాయ్‌ల్స్ అనే అనెస్తీషియా మిషన్ కనిపెట్టారు. ఈ మిషన్ అనెస్తీషియా విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. దీని ద్వారా ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ అనెస్తీషియా వాయువులను నిర్ధిష్టమైన ప్రమాణంలో రోగి శరీరంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. మాజిల్, రియోబోతమ్ ఎండోట్రాకియల్ ట్యూట్ అంటే స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని అందించేందుకు ఒక గొట్టాన్ని కనుగొన్నారు. మనం తరచుగా చెప్పుకునే జనరల్ అనెస్తీషియాను ఈ గొట్టం ద్వారానే ఇస్తారు.
పెయిన్ క్లినిక్‌లదే కీలక పాత్ర : డాక్టర్ రామశివనాయక్, అనెస్తీషియా వైద్యులు
పెయిన్ క్లినిక్ (దీర్ఘకాలిక నొప్పులు నివారించే) విధానాల్లో నేడు అనెస్తెషియాలజిస్టు తన సేవలను అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెయిన్ క్లినిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు. అదే విధంగా 1930లో రక్తనాళాల ద్వారా మత్తుమందును ఇచ్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. క్రిటికల్ కేర్ అంటే అత్యవసర చికిత్స విభాగం, ట్రామాకేర్ అంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో గాయాల బారిన పడిన వారికి చేసే చికిత్సా విధానం. అదే విధంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన వాటిపై శస్త్రచికిత్సలు జరిపి, అవి విజయవంతం కావడానికి అనెస్తీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక శాస్త్ర పరిజ్ఞానమే కారణం.