సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై కాంగ్రెస్‌లో ఆశ నిరాశల ధోరణి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీల తరహాలోనే పైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో గెలుస్తామా? ఓడిపోతామా? పరువు దక్కించుకుంటామా? అనే దానిపై స్పష్టత రావడం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి రెండో స్థానం కోసం ఎదురు చూడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండో స్థానం వస్తే చాలని, కనీసం పరువు దక్కే స్థాయిలో ఓట్లు వచ్చి బీజేపీ ఓడిపోతే తాము గెలిచినట్టేననే భావనలో కాంగ్రెస్ శ్రేణులున్నట్లు తెలుస్తోంది టీఆర్‌ఎస్, బీజేపీల నడుమ హోరాహోరాగా సాగిన పోరులో తమ సంప్రదాయ ఓటర్లతో పాటు మహిళలు ఎక్కు వగా తమవైపు నిలుస్తారని, 20 శాతానికి అటూ ఇటుగా ఓట్లు సాధిస్తామనే అభిప్రాయం మెజార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
కలిసొచ్చిన మహిళా గర్జన: ఉప ఎన్నిక ఖరారైన ప్పటి నుంచీ టీఆర్‌ఎస్, బీజేపీలను తట్టుకుని ప్రచార పర్వంలో నిలబడేందుకు శాయశ క్తులా ప్రయత్నించిన కాంగ్రెస్ పోలింగ్ రోజు న కూడా ఆపసోపాలు పడాల్సి వచ్చిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీల్లోకి కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగిన నేపథ్యంలో ఉన్న కొద్దిమందీ ఏం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓటర్లను ‘సంతృప్తి’ పరిచే స్థాయిలో కాంగ్రెస్ పంపిణీ జరగలే దని, చివరి వరకు ఉన్న కాంగ్రెస్ ఓటర్లు కూడా ఓటేసే క్షణంలో మారిపోయారనే చర్చ జరుగు తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిలో చాలామంది మళ్లీ తమకే ఓట్లేశారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఇక, ప్రచారం చివరి రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మహిళా గర్జన కలిసొచ్చిందని, ఆ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు మహి ళలను మెప్పించాయని, ఆడ బిడ్డగా స్రవంతిపై సానుభూతిని తీసుకురావడా నికి ఈ సమావేశం ఉపయోగపడిందనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్త మవుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీల హడావుడి పైకి కనిపించినప్పటికీ సైలెంట్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని, మహిళల ఆదరణతో మంచి ఓట్లు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment