Munugode Bypoll: Which Party Get Benefit With Cross Splitting Votes - Sakshi
Sakshi News home page

Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి.. 

Published Mon, Oct 24 2022 8:32 AM | Last Updated on Mon, Oct 24 2022 2:49 PM

Munugode Bypoll: Which Party Get Benefit With Cross Splitting Votes - Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది బరిలో ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో.. ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్‌ ఓటింగ్‌ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా కట్టడి చేసే పనిలో పడ్డాయి. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఏ మేరకు, ఎవరి ఓట్లను చీల్చగలిగారన్న అంచనాల్లో మునిగిపోయాయి. 

త్రిముఖపోరే.. అయినా తప్పని ఆందోళన 
ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్‌ పారీ్టల అభ్యర్థులు 10 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పారీ్టలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది. 

మారిన పరిస్థితుల్లో అంచనాలెలా? 
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది.  కాంగ్రెస్‌కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్‌ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి.

అయినా పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్‌ ఓటింగ్‌ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పారీ్టల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్‌ నుంచి వచి్చన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ గతంలో రాజగోపాల్‌రెడ్డికి పడిన కాంగ్రెస్‌ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్‌ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్‌ చెబుతోంది. 

గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇలా.. 
2018 సాధారణ ఎన్నికల్లో 16 మంది బరిలో ఉన్నారు. పోలైన మొత్తం 1,98,843 ఓట్లలో.. కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డికి 97,239 (48.90 శాతం) ఓట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,687 ఓట్లు (37.56 శాతం), బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు (6.40 శాతం) వచ్చాయి. అదే ఎన్నికల్లో రోడ్‌ రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్‌ మంగ వెంకటేశ్‌ కురుమకు 3,569 ఓట్లు (1.79 శాతం), ట్రక్కు గుర్తుపై ఎస్‌ఎంఎఫ్‌బీ పార్టీ నుంచి బరిలో ఉన్న చిలువేరు నాగరాజుకు 2,279 ఓట్లు (1.15 శాతం) లభించాయి. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి గోశిక కరుణాకర్‌కు 2,080 ఓట్లు (1.05 శాతం), నోటాకు 3,086 ఓట్లు (1.55 శాతం) పడ్డాయి. మిగతా అభ్యర్థులందరికీ కలిపి మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలను, ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement