సాక్షి, నల్గొండ: మునుగోడు అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్ అంతర్జాతీయ అంశాలు మాట్లాడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దని సూచించారు. కేసీఆర్ ముందు కొందరు ఉద్యోగులు మోకరిల్లుతున్నారని.. ప్రమోషన్ల కోసం టీఎన్జీవో ఉద్యోగులు సాగిలపడుతున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు నాంపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నలుగురు టీఎన్‌జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు .టీఎన్‌జీవో నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని. మీరే చెప్పాలని తెలిపారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే ఉంటానని. తమ ఆస్తులను మొత్తం బయట పెడతానని హెచ్చరించారు.
‘కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. ఆయన హామీలను ప్రజలు నమ్మడం లేదు. మా కార్యకర్తలు ప్రలోభాలకు లొంగలేదు. టీఆర్‌ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోంది. కుల సంఘాలు మరోసారి ఆలోచించాలి. ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో సర్కస్ చూపించారు. బెల్ట్ షాప్‌లు పెట్టి గౌడ కులస్తుల పొట్టకొట్టారు. చేనేత కార్మికులకు టీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలి. కౌలు రైతులు, పత్తి రైతులకు ఏం చేశారు.’ అని టీఆర్‌ఎస్‌పై బండిసంజయ్ ఫైర్ అయ్యారు.
చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment