సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. అధికార టీఆర్‌ఎస్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
మునుగోడు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం కదిలింది. బీజేపీ ఓడించేందుకు మునుగోడుకు ఏకంగా 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు వచ్చారని ఎద్దేవా చేశారు. అంతకుముందు మునుగోడుకు ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదని సంజయ్ ప్రశ్నించారు. కూర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ పనులేమయ్యాయి. 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ హామీ ఏమైందో చెప్పాలన్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇస్తానని చెప్పి.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు రానివారు, దళితబంధు రానివారు, నిరుద్యోగ భృతి పొందనివారు బీజేపీకి ఓటు వేసి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయే తప్ప.. కేసీఆర్ మీద ఉద్యమ కేసులు లేవని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment