మర్రిగూడ: ‘టీఆర్‌ఎస్ ముసుగులో ఉన్న గూండాలు, కౌరవులు వంద మంది వచ్చినా ఏమీ చేయ లేరని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్న గూడలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనపై కొందరు కార్య కర్తలు దాడికి యత్నించారు.
దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకుని చెదరగొట్టారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని రౌడీయిజం, గుండాయిజం నడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గద్దె దించి, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టే వరకు ప్రాణం పోయినా భయపడేది లేదన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ గేటును పగులగొట్టి లోపలికి వెళ్లే రోజులు రానున్నాయని అన్నారు.
బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి: సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు గురువారం మర్రిగూడ ఓటర్లను ప్రలోభా నికి గురిచేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగా రు. దీంతో బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ విష యం తెలుసుకుని పోలీసుల తీరుపై రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment