![Munugode Results: Jagadish Reddy Fires BJP Over Alligations On Counting - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/Jagadish-Reddy.jpg.webp?itok=0j2p_Hw_)
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌పై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈసీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీరియస్ అయ్యింది. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చిరించింది.
అయితే బీజేపీ ఆరోపణలను టీఆర్‌ఎస్ ఖండించింది. ఓటమి తట్టుకోలేకే కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అధికారులను భయపెట్టడం సరికాదని విమర్శించారు.
కాగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగంవారిగుడెంలో టీఆర్‌ఎస్ 340 ఓట్లు లీడ్ సాధించింది.
మీడియా ఆందోళన
మునుగోడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment