సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉప ఎన్నిక ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఎన్నిక సరళిపై మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాము. పలుచోట్ల నగదు, బంగారం, చీరలు సీజ్ చేశాము. 8.27 కోట్ల వరుకు నగదు, ఇతర వస్తువులు, 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాము.
పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 98 ఫిర్యాదులు వచ్చాయి. 70 మంది స్థానికేతరులను బయటకు పంపించాము. నల్లగొండలో ఈవీఎంలను భద్రపరుస్తాము. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. కౌంటింగ్‌లోనూ మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాము. ఈ నెల 6వ తేదీన కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాము. స్థానికేతరలను గుర్తింపు కోసం బృందాలు ఏర్పాటు చేశాము అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment