మునుగోడు: తాను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేవలం రూ.లక్ష ఖర్చయ్యిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చెప్పారు. ఆయన ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నర్సయ్య బుధవారం మునుగోడులో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికల్లో నామినేషన్, వాల్ పోస్టర్లు, మైక్‌లకు ఇతర ఖర్చులు తప్ప.. ఓటర్లకు ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తే స్థానికులే తమకు భోజనాలు వండి పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఖర్చు రూ.3 లక్షలకు చేరిందన్నారు. కానీ, మునుగోడు ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది అందరికి పెద్ద ముప్పుగా మారనుందని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment