
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున ఓ బీజేపీ నాయకుడు పోలింగ్ బూత్ వద్ద వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నాయకుడు చేసిన యాక్టింగ్‌పై వైరల్ అయిన వీడియోపై టీఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘కమల్‌హాసన్’గర్వపడేలా నటించాడు అంటూ కేటీఆర్ చమత్కరించారు.
క్రిశాంక్ తన ట్వీట్‌లో ‘బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని సూచించినందుకు..వేరే వ్యక్తికి ఫోన్‌ను విసిరేసి, పోలింగ్ కేంద్రంలోకి పరుగెత్తాడు. తనకు తానే నేలపై పడుకుని, పోలీసులు కొట్టారని ఏడ్చాడు. మోదీ యాక్టింగ్ స్కూల్’అని క్రిశాంక్ ట్వీట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
😂 Kamal Hasan would be proud https://t.co/AoOKtSGW40
— KTR (@KTRTRS) November 4, 2022
చదవండి: జాతీయ బరిలో బీఆర్‌ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment