
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నికల వేళ మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ హల్‌చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ కనిపించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు. మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళ్లారు. రైతు వేషంతో దర్శనమిచ్చారు. సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన మాటలు, చేష్టలతో రైతులను నవ్వించారు. పోలింగ్ రోజున కూడా తన దైన శైలిలో పంచ్‌లు వేస్తూ, పరుగులు పెడుతూ నవ్వించారు.
Comments
Please login to add a commentAdd a comment