సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయాల్లో అనుకోని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా మునుగోడు విషయంలో మరోసారి ఆసక్తికర ఘటన జరిగింది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సంఘం(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి.. రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డిపై అనర్హత వేటు వేయాలి. రాజగోపాల్‌రెడ్డి రూ. 18వేల కోట్ల పనులు తీసుకుని మునుగోడులో ఓట్లు కొంటున్నారు. రూ. 18వేల కోట్లలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వాటా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment