ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తనను తప్పుకోవాలని నయీం మనుషులు ఒత్తిడి చేశారని చెప్పారు. పోటీ నుంచి తప్పుకోకుంటే చంపుతామని బెదిరించారని తెలిపారు.