సాక్షి, హైదరాబాద్: పార్టీ మార్పుపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను బీజేపీ పార్టీని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం.. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
‘‘నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించింది’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా మోదీ, అమిత్ షాకి ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశాను. నేనే కాదు ఇతర ముఖ్య నాయకులు ఎవరు బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతాం’’ అంటూ కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
చదవండి: ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment