
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ కుటుంబసభ్యుడని, వెంకట్‌రెడ్డి వేరు, రాజగోపాల్‌రెడ్డి వేరంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్... కాకపుట్టిస్తున్న మునుగోడు రాజకీయం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. రాజగోపాల్‌రెడ్డికి బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురించి తాను ప్రస్తావన చేయలేదని స్పష్టం చేశారు. ఆయనకు, తనకు మధ్య కావాలనే విబేధాలు సృష్టిస్తున్నారన్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment