
యాదగిరిగుట్ట (ఆలేరు): రానున్న రెండేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే సీఎం కేసీఆర్ దాచిన సొమ్మును, అవినీతిని బయటపెడతామని, కొడుకు, బిడ్డ సంపాదించిన రూ.50 కోట్ల సొమ్మును బయటకు తీసుకొస్తామని పేర్కొన్నారు. ‘కోమటిరెడ్డి సోదరులిద్దరం వైఎస్సార్ అభిమానులం. ఇచ్చిన మాటను ఆ మహానేత ఎలా నిలబెట్టుకున్నారో.. అలాగే మేమూ ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకు అండగా నిలుస్తాం’ అని అన్నారు. ఇప్పటి కే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నా రు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దింపే బాధ్యత కోమటిరెడ్డి సోదరులిద్దరం తీసుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment