కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో సహా కాంగ్రెస్, బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ లైట్‌గా తీసుకుంటుంది. ఇక, మునుగోడుకు ఉప ఎన్నిక రాకపోవచ్చు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మునుగోడుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చినా హస్తం పార్టీ గెలవదు. కాగా, మునుగోడులో కమ్యూనిస్టులు సైతం ఒంటరిగా గెలవలేరు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment