indrasenareddy
-
మునుగోడుపై మెలిక.. ఉప ఎన్నిక రాకపోవచ్చు: ఇంద్రసేనారెడ్డి
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీ టీఆర్ఎస్తో సహా కాంగ్రెస్, బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ లైట్‌గా తీసుకుంటుంది. ఇక, మునుగోడుకు ఉప ఎన్నిక రాకపోవచ్చు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మునుగోడుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చినా హస్తం పార్టీ గెలవదు. కాగా, మునుగోడులో కమ్యూనిస్టులు సైతం ఒంటరిగా గెలవలేరు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదన్నారు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పాలమూరు పట్టణం మీద బీజేపీ ప్రత్యేక ఫోకస్ -
భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి
బీజేపీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకున్న భూకుంభకోణాలపై అనేక ఆధారాలు బయటపడుతున్నందున ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ నాగం జనార్దనరెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక్క గజం కబ్జా కాలేదని, ఒక్క పైసా నష్టం జరగలేదని సీఎం కేసీఆర్ తనకు తానుగా ఏవిధంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటారని ప్రశ్నించారు. భూకుం భకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించకుంటే సీఎం కేసీఆర్బాధ్యతల నుంచి తప్పు కోవాలని డిమాండ్ చేశారు. సీఎం చెబుతున్నట్లు ఒక్క గజం కూడా కబ్జా కాకుంటే, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకపోతే మియాపూర్ భూములతోపాటు, దండు మైలారంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు కుటుంబసభ్యుల భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులు నివేదిక ఎందుకు ఇచ్చారని ప్రశ్నిం చారు. ఈ కుంభకోణాలు జరగకపోతే 72 మంది సబ్ రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 750 ఎకరాల ఎవక్యూ ప్రాపర్టీ పరి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. భూ ఆక్రమణలన్నీ సీఎం కార్యాలయం ప్రత్యక్ష ప్రమేయంతోనే జరుగు తున్నాయని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూముల వివరాలను వెబ్సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు గోప్యంగా ఉంచుతు న్నారని ప్రశ్నించారు. -
సీఎం కొడుకే రెచ్చగొట్టే ప్రకటనలా?
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో విద్వేషాలను రెచ్చగొట్టడం తీవ్రమైన నేరమని, ప్రజాప్రతినిధులే ప్రజలను రెచ్చగొట్టడం తీవ్రమైన చర్యగా భావించాలని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, చట్టాలను అతిక్రమించమే అవుతుందన్నారు. ఎదుటి వారిపై దాడి చేయమనడం కూడా నేరమేనని, దాడి చేసిన వారి కంటే చేయమని ప్రోత్సహించేవారే చట్టం దృష్టిలో మొదటి నేరస్థులని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలను పూర్తిగా నిర్వీర్యం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలతో ట్రాక్టర్లను అందిస్తే వాటిని టీఆర్ఎస్ కార్యకర్తలకు అందించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కుమారుడే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మంత్రుల రెచ్చగొట్టే మాటలను నమ్మి, ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో, తమ పనులు జాప్యం కావడాన్ని తట్టుకోలేక గతంలో కొందరు ఆవేశంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని మర్చిపోలేదన్నారు. అసెంబ్లీలో, బయటా ప్రభుత్వ అవినీతిపై ఎవరు ప్రశ్నించినా అభివృద్ధికి అడ్డం వస్తున్నారని అధికార పార్టీ ఎదురుదాడి చేస్తున్న విషయం ప్రజలందరికి తెలుసునన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, తమ ప్రభుత్వం నీతివంతమైనదని డబ్బా కొట్టుకోవడానికే కేటీఆర్ ఇతర మంత్రులు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల మాటలు నమ్మి సాధారణ ప్రజలు కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని ఇంద్రసేనారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఈసారి మాత్రం గెలుపు మాదే.. కాదు మళ్లీ మాదే
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోమవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో టీఆర్ఎస్ నేత, బీజేపీ నేత మధ్య స్వల్ఫ వాగ్వాదం చోటుచేసుకుంది. మా పార్టీనే గెలుస్తుందంటే మా పార్టీనే గెలుస్తుందంటూ వారి మధ్య మాటలు పేలాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు తామే గెలుచుకుంటామని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే, తమకు అసలు పోటీనే లేదని, టీఆర్ఎస్పై గెలవలేని ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికల్లో ఒక్కటయ్యాయని టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. అయినప్పటికీ విజయం తమదేనని అన్నారు. ఫలితాలు చూసి బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో కల్పించుకున్న ఇంద్ర సేనారెడ్డి ఈసారి టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చేందుకు అందరూ సిద్ధమయ్యారని, తాము గెలుస్తున్నామని చెప్పారు.