భూమాయపై సీబీఐతో విచారణ చేపట్టాలి
సీఎం చెబుతున్నట్లు ఒక్క గజం కూడా కబ్జా కాకుంటే, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకపోతే మియాపూర్ భూములతోపాటు, దండు మైలారంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు కుటుంబసభ్యుల భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అధికారులు నివేదిక ఎందుకు ఇచ్చారని ప్రశ్నిం చారు. ఈ కుంభకోణాలు జరగకపోతే 72 మంది సబ్ రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 750 ఎకరాల ఎవక్యూ ప్రాపర్టీ పరి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. భూ ఆక్రమణలన్నీ సీఎం కార్యాలయం ప్రత్యక్ష ప్రమేయంతోనే జరుగు తున్నాయని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూముల వివరాలను వెబ్‌సైట్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు గోప్యంగా ఉంచుతు న్నారని ప్రశ్నించారు.