సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు కారణంగా పాలిటిక్స్ వేడెక్కాయి. శనివారం టీఆర్‌ఎస్ తలపెట్టిన ప్రజా దీవెన సభలో బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా దీవెన సభలో కేసీఆర్ మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదు. జాతీయ రాజకీయాలు చెప్పి మళ్లీ ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు. మునుగోడు ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారు. మునుగోడులో రైతులకు ఇంకా సాగునీరు అందలేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ పూర్తి చేయలేకపోయింది.
సీఎం కేసీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలను సహాయం చేసినట్లు చెప్పారు. వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? ఎందుకు డబ్బులు ఇచ్చారు. దీన్ని రాజగోపాల్ రెడ్డి.. ఇన్‌కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించారా?. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోడు భూముల సమస్యను ఎలా తీరుస్తారో చెప్పలేదు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసిఆరే. బీజేపీకి కేసీఆరే ఆదర్శం. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచిందే కేసీఆర్. ఏకలింగం ఉన్న బీజేపీని మూడు తోకలు చేసింది నువ్వే కదా అని విమర్శించారు. కేసీఆర్ గతంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని అవమానించారు. కానీ, ప్రస్తుతం కమ్యూనిస్ట్ సోదరులు ఎందుకు కేసీఆర్ ఉచ్చులో పడుతున్నారో తెలియడం లేదు’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో మరో ట్విస్ట్.. అది నిజమేనా?
Comments
Please login to add a commentAdd a comment