
తాను ఓ కార్యకర్తకు బరోసా ఇచ్చేందుకు మాట్లాడిన మాటలను...
సాక్షి, హైదరాబాద్ : ‘‘కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ షిప్. నేను బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతుంద’’ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీలో ఏ కండీషన్స్ లేకుండా చేరుతానన్నారు. సోనియా, రాహుల్, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉందన్నారు. తాను ఓ కార్యకర్తకు బరోసా ఇచ్చేందుకు మాట్లాడిన మాటలను హైలెట్ చేశారని, ఇప్పుడు ఆ వ్యక్తే టీఆర్ఎస్‌లో చేరిపోయాడని చెప్పారు. నియోజక వర్గ ప్రజలు తన వెంట వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. బీజేపీలో తన కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారని, తాను ఓ సాధారణ కార్యకర్తలా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాన్నారు. మరో 20 ఏళ్ల వరకు బీజేపీనే దేశంలో అధికారంలో ఉంటుందని, వచ్చే జమిలీ ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ విజయం ఖాయమని జోష్యం చెప్పారు.