సాక్షి, హైదరాబాద్: విద్యా, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బడుల పరిస్థితి ఏమాత్రం బాగుపడలేదన్నారు. గత ఆరేళ్లలో పేదల ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ తీ సుకోలేదని విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య, సాంకేతిక వి ద్యాశాఖ పద్దులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. ఇటు క్రీడలు, యువజన సేవ లు, పర్యాటక, కళలు, సాంస్కృతికశాఖ పద్దు ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. వైద్య,ఆరోగ్యశాఖ పద్దును మంత్రి ఈటల రాజేందర్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ పద్దును మంత్రి మల్లారెడ్డి ప్రతిపాదించారు. అలాగే ఎండోమెంట్, అట వీ, శాస్త్ర, పర్యావరణ, న్యాయ పాలన పద్దులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పద్దులపై మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.
ఇక సీఎం కేసీఆర్ తరఫున ప్రభుత్వ రంగ సంస్థల పద్దులను కేటీఆర్.. భారీ, మధ్య, చిన్నతరహా, గవర్నర్, కేబినెట్, సాధారణపరిపాలన, ఐఅండ్‌పీఆర్ పద్దులను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ పద్దులను మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, రోడ్లు, భవనాలు, స్టేట్ లెజిస్లేచర్ పద్దులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. విద్యుత్ శాఖ పద్దును మంత్రి జగదీశ్‌రెడ్డి, విత్త పాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకాల పద్దులను మంత్రి హరీశ్ ప్రతిపాదించారు. ఈ పద్దుల పై చర్చ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పేద ల కోసం పెద్ద ఎత్తున నిధుల ను ఖర్చుచేస్తున్నట్టు చెబుతు న్నా, అవి సరిగా ఖర్చు కావ డం లేదన్నారు. ఈ ఆసుపత్రు ల్లో తగిన మౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికరాలు లేకపోగా, తగిన సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది లేక, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యారంగాన్ని సరైన పద్ధతిలో నిర్వహించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియం డిమాండ్‌కు తగ్గట్టుగా ఒకటి నుంచి 10 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
పెద్దన్న కొట్టనంటే మాట్లాడతాను..
పంచాయతీరాజ్ పద్దులపై తన పెద్దన్న, పా తికేళ్లుగా మిత్రుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొట్టనంటే మాట్లాడతానని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రెండ్రోజుల క్రితం చర్చ సందర్భంగా తనను ఉరికిచ్చి కొడతారని మంత్రి అ న్నారని, అయినా మిషన్ భగీరథ పూర్తిగా స క్సెస్ కాలేదని, తన నియోజకవర్గంలోని 33 4 హాబిటేషన్లలో సగం వాటికి ఇంకా నీళ్లు రాలేదన్నారు. గ్రామాల్లో మద్యం షాపులు, బెల్ట్‌షాపు ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో పారదర్శకత లేదని, అప్పులు తెచ్చిన రూ. వేల కోట్లు సరిగా ఖర్చు చేయడం లేదన్నారు. అప్పటికే 2, 3 పర్యాయాలు ప్రసంగం కొనసాగించేందుకు అనుమతినిచ్చిన స్పీకర్ ఈ సంద ర్భంగా రాజగోపాల్ మైక్‌ను కట్ చేశారు.
మాకు అబద్ధాలు రావు..: సీతక్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా చోట్ల ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోరారు. విద్యా సౌకర్యాలు సైతం మెరుగ్గాలేవని, వాటిపై దృష్టి పెట్టాలన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యాని కి నిధులు పెంచాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సభ్యులు అబద్ధాలు చెప్పొద్దు అనడంతో ‘మాకు అబద్ధాలు రా వు. అబద్ధాలను సైతం అద్భుతంగా చెప్పేం త గొప్పోళ్లం కాదు. ఉన్నదే చెబుతాం..’అం టూ సీతక్క తిప్పికొట్టారు. ఇక గోదావరి తమ ప్రాంతం నుంచే వెళ్తున్న తమ నియోజకవర్గానికి చుక్కా నీరు అందడం లేదని, ఈ దృష్ట్యా చెక్‌డ్యామ్‌లను ఎక్కువగా మంజూరు చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment