
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు (ఎస్‌కే) కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్‌కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్‌టాప్‌లను సీజ్ చేశారు.
తన ఆఫీస్ నుంచి సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో సునీల్ కార్యాలయంలోని సిబ్బందితో సెల్‌ఫోన్‌లు ఆఫ్ చేయించారు. గత కొంత కాలంగా ఎస్‌కే టీమ్ తెలంగాణ కాంగ్రెస్‌కు పని చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment