
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం నమోదు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాయడం,
సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజరవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment