War Room
-
70 స్థానాల్లో గెలుపు..బీఆర్ఎస్ వార్ రూం సంచలన నివేదిక..!
-
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
టీ కాంగ్రెస్‌లో సొంత నేతలపైనే ట్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటి దొంగల కదలికలు బయటపడుతున్నాయా?. సొంత నేతలను, అదీ సీనియర్లను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ రగడ వెలుగుచూసిన తరుణంలో ప్రస్తుతం ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. తనతో పాటు ఇతర నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తనపైనా, ఓ సీనియర్‌పైనా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మే 5వ తేదీన ఉత్తమ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెంబర్ నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ నెంబర్ భీమవరానికి చెందిన ఓ మహిళ పేరు మీద ఉందని గుర్తించారు. కానీ, ఆ నెంబర్ వాడిన లొకేషన్ మాత్రం ఉత్తమ్ ఇంటి సమీపంలోనే ఉంది. ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఓ ప్లాట్ నుంచి ఈ తతంగం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆ ప్లాట్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పేరు మీద ఉండడం, ఆ విభాగపు ఇంఛార్జి జయల ప్రశాంత్ తన టీంతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, డేటా సేకరించారు. ఐదు కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. ప్రశాంత్‌పై కేసు నమోదు మరోవైపు భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్ కాంగ్రెస్ మీటింగ్‌లో కూడా ఆయన.. తనపైనా ఇదే తరహా ప్రచారం జరుగుతోందని అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి. తమ విచారణలో ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ క్యాంపెయిన్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తేల్చారు. అనుచిత పోస్టులతో ట్రోలింగ్‌కు పాల్పడినందుకుగానూ ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రశాంత్‌పై వేటు.. ఉత్తమ్‌కుమార్‌తో పాటు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క్, మరికొందరు నేతలపైనా ఈ ట్రోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టలు చేసినందుకుగానూ ప్రశాంత్‌పై పార్టీ వేటు వేసింది. అయితే.. ఈ పరిణామంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివనసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే.. వార్‌రూమ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన. ఈ వ్యవహారం ఇక్కడితోనే చల్లారుతుందా? లేదంటే ఇంకా ఎక్కడిదాకా అయినా వెళ్తుందా? అనే వేచిచూడాలి. -
వార్ రూమ్ కేసులో ప్రధాన నిందితుడిగా మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రధాన నిందితుడిగా మారనున్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ, నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో ఇదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోపక్క ఈ కేసులో నోటీసులు అందుకున్న మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవిని దాదాపు రెండు గంటలపాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని స్పష్టం చేసి పంపారు. వార్‌రూమ్ ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి మల్లు రవి తెరపైకి వస్తున్నారు. వార్‌రూమ్‌పై దాడి, సోదాలు జరిగిన సమయంలోనూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడూ రవి స్పందించారు. వార్‌రూమ్ ఇన్చార్జ్గా ఉన్న తన నుంచి ముందు వాంగ్మూలం నమోదు చేయమంటూ పోలీసులకు లేఖ రాశారు. సునీల్ కనుగోలు విచారణ తర్వాత కేసులో మల్లు రవిని నిందితుడిగా చేర్చిన అధికారులు, ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత వస్తానంటూ సమయం కోరిన మల్లు రవి బుధవారం విచారణకు హాజరయ్యారు. తానే వార్‌రూమ్ ఇన్చార్జ్ అంటూ అంగీకరించిన ఆయన, అక్కడి వాళ్లు పోస్టు చేసే ప్రతి అంశంతోనూ తనకు సంబంధం ఉండదని పేర్కొన్నారని తెలిసింది. తాము కేవలం కాన్సెప్ట్ మాత్రమే చెప్తామని, అక్కడి వాళ్లు దానికి అనుగుణంగా వీడియోలు, మీమ్స్ తయారుచేసి పోస్టు చేస్తారని వివరణ ఇచ్చారని సమాచారం. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన రవి పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తారనే సమాచారం తనకు తెలియదని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరిస్తానని అన్నారు. వార్ రూమ్ నుంచి మా పార్టీకి సంబంధించి విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకొచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణ ముగిసిన తరవాత ఆ సమాచారం తిరిగి ఇవ్వాలని కోరతానన్నారు. చదవండి: ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు! -
ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విచారణ ముగిసింది. బుధవారం సుమారు మూడు గంటలపాటు ఆయన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వార్ రూం కు నేనే ఇంఛార్జి గా ఉన్నాను. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు అని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూం ఇన్ఛార్జిగా తానే ఉన్నానని, అక్కడ జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ‘‘కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నాం. ఎవరినీ కించపరచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నాం. అలాగే.. సునీల్ కనుగోలుకు, వార్ రూంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మల్లు రవి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏం జరుగుతోంది? -
నాపై కేసు పెట్టిన విషయం తెలియదు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు. 'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు. చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్) -
కాంగ్రెస్ వార్ రూం కేసు.. మల్లు రవిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చిన పోలీసులు.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. పార్టీ వ్యూహకర్తగా పేరు వినిపిస్తున్న సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ఆధారంగానే మల్లు రవిపై కేసు నమోదు అయ్యింది. అయితే.. మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు మల్లు రవి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం హాజరు కావాల్సిందిగా ఇచ్చిన నోటీసులపై ఆయన వివరణ కోరగా.. గురువారం విచారణ కోసం వచ్చినప్పుడే చెప్తామని అధికారులు బదులు ఇచ్చారు. ఈ క్రమంలో.. బుధవారం ఈ సీనియర్ నేత పేరును నిందితుడిగా చేర్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. సాక్షి టివీ చేతిలో సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ‘‘కాంగ్రెస్ వార్ రూంతో నాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్‌కు వ్యూహాలు మాత్రమే చెప్తాను. వార్ రూం ఇంఛార్జి మల్లు రవి. మల్లు రవి చెప్పింది మాత్రమే మా టీం చేస్తుంది’’ :::పోలీసులకు సునీల్ కనుగోలు స్టేట్మెంట్ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో.. గతేడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. అయితే.. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు కూడా. ఇక సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో సీఆర్పీసీ 41A కింద మల్లు రవికి సోమవారం నోటీసులు అందజేశారు. ఈనెల 12వ తేదీన(గురువారం) విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్‌ఛార్జి అయిన మల్లు రవికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నా.. కేసు నమోదు కావడంతో తర్వాతి పరిణామం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘వార్ రూమ్’ కేసులో మల్లు రవి!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవిని నిందితుడిగా చేర్చాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ‘నా వాంగ్మూలం నమోదు చేయండి’ అంటూ మల్లు రవి ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాయడం, సోమవారం దర్యాప్తు అధికారుల ఎదుట హాజరైన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మల్లు రవి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనకు ఇచ్చిన నోటీసుపై అక్కడి అధికారులను వివరాలు కోరారు. దానికి సంబంధించిన వివరాలు అందించిన అధికారులు గురువారం విచారణకు హాజరవ్వాలని చెప్పారు. అది ముగిసిన తర్వాత ఈ కేసులో మల్లు రవిని ఐదో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినంటూ ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండగా, వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు సోమవారం హాజరయ్యారు. గంట పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నేను సాఫ్ట్వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
‘వార్ రూమ్’ కేసులో ప్రధాన నిందితుడికి నోటీసులు.. కానీ ఇక్కడో ట్విస్ట్!
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం. తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ‘ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’ పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు -
Telangana: వార్ రూం ఇష్యూ.. కాంగ్రెస్‌కు మేలా? కీడా?
వార్ రూమ్ ఇష్యూ టీ.కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వార్ రూమ్‌లో సోదాలు చేసి తెలంగాణ సర్కార్... కాంగ్రెస్‌కు ఆయుధం తానే ఇచ్చిందా? వచ్చిన ఆయుధాన్ని హస్తం పార్టీ నేతలు వాడుకుంటారా? తమ ఆధిపత్య పోరాటాలతో జార విడుచుకుంటారా? వార్ రూమ్ ఆందోళనలో టీ.కాంగ్రెస్ నేతలంతా ఎందుకు పాల్గొనలేదు? చేయి కాలుతూనే ఉంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ తెలంగాణ కాంగ్రెస్‌కు సానుకూలంగా వార్తలు రావడం అరుదైన అంశంగా మారిపోయింది. పార్టీ బాగు మరచి కొట్టుకుంటున్న నాయకులు..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..మీడియాలో ఒకరి మీద ఒకరి విమర్శలతో గాంధీభవన్ హోరెత్తిపోయేది. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వంటి ఎన్నో అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌కు నెగిటివ్‌గా మారాయి. కొంతకాలం నుంచి కారు, కమలం పార్టీల మధ్య నడుస్తున్న వార్..రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న సందేహాన్ని కూడా ప్రజల్లో కలిగిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక పార్టీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకున్నారు. సునీల్ టీమ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సైబరాబాద్ పోలీసులు ఆయన కార్యాలయం అయిన కాంగ్రెస్ వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని అక్కడి సిబ్బందిని అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ భగ్గుమంది. రాష్ట్ర మంతా కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఒక్క రోజే హడావిడా? పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిని టీ.కాంగ్రెస్ సకాలంలో సక్రమంగానే ఉపయోగించుకోగలిగింది. అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదనే యాంగిల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు నాయకులు. దాడి జరిగిన రోజు రాత్రంతా సునీల్ ఆఫీస్ లో షబ్బీర్ అలీ, మల్లురవి, హైదరాబాద్ నగర నాయకులు పోలీసుల తీరుపై ఆందోళన చేసారు. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. చాలా కాలంగా మీడియాలో పాజిటివ్ వార్తలే లేని కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం బాగా ఉపయోగపడింది. ఆ రోజంతా మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన వార్తలు కనిపించాయి. ఇంట్లోనే పెద్ద వార్ ఇక కొందరు నేతలు మినహా మిగతా వారంతా కాంగ్రెస్ వార్ రూమ్‌లో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వరకు కమిటీల ఏర్పాటు గురించి పార్టీలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సునీల్ అంశం తెరపైకి వచ్చి కాంగ్రెస్‌కు మేలు చేసింది. అయితే కొందరు నేతలు అసలు విషయాన్ని పక్కన పెట్టి సునీల్ అంశాన్ని ఎత్తుకున్నారంటూ కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు సునీల్ ఎవరు అంటూ కొందరు.. వార్ రూమ్ అయితే గాంధీ భవన్ లో ఉండాలి కానీ బయట ఎందుకు ఉందని ఇంకొందరు.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులు చర్చకు రాకుండా చేయడానికే అని మరికొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. వార్ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడిని ఒక అంశంగానే కొందరు నేతలు పరిగణించకపోవడం విశేషం. అర చేతికి అయిదు వేళ్లు, ఏ ఒక్కరికి కలవని దారులు ఒక సీరియస్ విషయంలోనే విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక ముందైనా కలిసి పనిచేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఇలాగే పలు అంశాలపై నాయకులంతా ఏకమైనా...అది తాత్కాలికమే అని నిరూపించారు. పార్టీ ఒకటైనా ఎవరి వ్యవహారం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వార్ రూమ్ ఇష్యూని కాంగ్రెస్ నేతలు ఏమేరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘ఇందుకు మంత్రి కేటీఆర్, సీపీ సీవీ ఆనంద్లదే బాధ్యత’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్‌రూమ్‌లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది టీపీసీసీ. కాంగ్రెస్ వార్ రూమ్‌పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి సీజ్ చేయడాన్ని ప్రధానంగా తప్పు పట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఈ దాడులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని రేవంత్‌రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. మరొకవైపు ఈ ఘటనపై టీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్ వార్‌రూమ్‌పై దాడి చేశారని, 50 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ప్రొసీజర్ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదని, 41A CrPC నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఈ అక్రమాలకు మంత్రి కేటీఆర్, సీపీ సీవీ ఆనంద్ బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు తాను కూడా అదే పోస్ట్ చేస్తానంటూ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. For this FB post Telangana Congress War room headed by #SunilKanugolu team at Hyderabad was raided and 50 computers taken … Data stolen … Five of our Proffesional partners arrested illegally without FIR .. Now I am posting the same let @TelanganaCMO arrest me …#HitlerKCR pic.twitter.com/6SonRAHRdZ — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 14, 2022 -
కరోనాపై ఆర్బీఐ ‘వార్’..!!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. ఈ వార్ రూమ్ .. ప్రత్యేకంగా డెట్ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలా పాలు పర్యవేక్షిస్తుందని అధికారి తెలిపారు. బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ (ఎస్‌ఎఫ్‌ఎంఎస్) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ–కుబేర్, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని వివరించారు. ప్రపంచంలోనే తొలిసారి.. ‘ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు‘ అని అధికారి వివరించారు. ‘సాధారణంగా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్ మహమ్మారితో యుద్ధంలో ఆర్బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదు‘ అని చెప్పారు. దేశవ్యాప్తంగా 31 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14,000 మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా.. గత వారం రోజులుకాగా కేవలం 10% మందే విధులకు హాజరవుతున్నారు. ఇలా ఏర్పాటు చేశారు.. వార్ రూమ్ ఏర్పాటు చేసిన తీరుతెన్నులను అధికారి వివరించారు. 150 మంది ఆర్బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్ డెస్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారందరికీ అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్ రూమ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. నోట్లను ముట్టుకుంటే చేతులు కడుక్కోండి: ఐబీఏ కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టిన తర్వాత, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్‌ను వినియోగించాలని కోరింది. ఇందుకు ‘కరోనా సే డరో న, డిజిటల్ కరో నా‘ (కరోనాతో భయం వద్దు.. డిజిటల్ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. -
కాంగ్రెస్ ఐటీ వార్
సాక్షి:ఫలానా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి... ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు గత ఎన్నికలలో పోలయ్యాయి... ఆయా బూత్‌లలో ఏయే సామాజిక వర్గాలున్నాయి... ఆ సామాజిక వర్గాలు ఏ పార్టీవైపు మొగ్గుచూపాయి.. అందుకు కారణాలేంటి..? ఆ నియోజకవర్గం ప్రజలకు అధికార టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు ఎలా ఉంది? అక్కడి ప్రజల తక్షణావసరాలు ఏంటి..? కాంగ్రెస్ కూటమి పక్షాన అభ్యర్థులు అక్కడి ప్రజలకు ఇవ్వాల్సిన ప్రధాన హామీలేంటి..? సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం జరగాలి? నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఎలా ఖర్చయ్యాయి..? ఎంత ఖర్చయ్యాయి... ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల జాతకమంతా ఒక్కచోట నుంచే కంట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దానిపేరే వార్‌రూం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ వార్‌రూంలను హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని ఓ కేంద్రం అనుసంధానం చేస్తోంది. దీనికి ఏఐసీసీ మీడియా ఇన్చార్జి మెహ్రోజ్ఖాన్ నేతృత్వం వహిస్తుండగా, రాహుల్ కోటరీలోని ముఖ్య నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు సమన్వయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే.. ఈ వార్‌రూంల వేదికగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని 150 మంది సిబ్బంది అనుక్షణం ఎన్నికల పనిలో బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది కాలంగా సేకరిస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. అధికార పార్టీ, ఇతర ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు, వాటికి ఇవ్వాల్సిన కౌంటర్లను కూడా ఇక్కడి నుంచే పంపుతున్నారు. కూటమి పక్షాల మధ్య ఓట్ల బదలాయింపునకు ఉన్న అవరోధాలు, అనుకూలతల గురించి వివరిస్తూ సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రంలో పోటీచేస్తున్న 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఇక్కడి నుంచి కిట్లు పంపారు. ఈ కిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుకెళుతుండడం వార్‌రూం ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కిట్‌లో ఏమున్నాయంటే...! ∙పార్టీ మేనిఫెస్టో, ∙టీఆర్ఎస్ వైఫల్యాలు ∙ముఖ్యమైన పనులు ∙నియోజకవర్గ మ్యాప్ ∙నియోజకవర్గ స్థాయి సమావేశాల షెడ్యూల్ ∙కోఆర్డినేటర్ల విధులు, వివరాలు ∙రిటర్నింగ్ అధికారుల వివరాలు ∙యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు ∙గత ఎన్నికల డాటా ∙కుల సమీకరణలు ∙శక్తి యాప్ వివరాలు ∙చారమ్స్ ∙ఎల్డీఎంఆర్సీ ∙సోషల్‌మీడియా -
అఖిలేష్ ప్రచారానికి వార్ రూమ్ సపోర్టు
-
పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్ అసంబద్ధం
* ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ * ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దు * మోడీ సన్నిహితులతో మాట్లాడి ఆర్డినెన్స్ వద్దని చెప్పా * హడావుడిగా తెస్తే ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే * ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలి * పోలవరానికి వ్యతిరేకం కాదు, ఎత్తు తగ్గించాలని కోరుతున్నాం * వార్‌రూమ్‌కు చంద్రబాబు వస్తే స్వాగతిస్తామని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాలను విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నిస్తోందని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాబోయే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే సీఆర్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం అసంబద్ధమని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యే ముందు మంగళవారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లుకు విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. నాలుగు రోజుల్లో పార్లమెంట్ సమావేశం కానున్న సమయంలో కొంపలంటుకున్న చందంగా కేబినెట్ తొలి భేటీలోనే ఆర్డినెన్స్‌ను తేవడమంటే అది ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే అవుతుంది. ప్రధాని దీన్ని పట్టించుకోకుంటే అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లవుతుంది. తెలంగాణకు ఏమాత్రం మింగుడుపడని ఈ నిర్ణయాన్ని మోడీ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాకే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో కోరారని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మాట్లాడానని, ఆర్డినెన్స్ తేవొద్దని కోరినట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి నోట్‌నే తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ దాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిసిన వెంటనే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడాను. ఇది ఎవరికీ మంచిది కాదని, ఈ నిర్ణయం మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పా’ అని కేసీఆర్ తెలిపారు. ‘రాష్ర్ట విభజన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది. అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉంది. అది కూడా దానికదే జరిగిపోతుంది. ఇప్పుడు చట్టాన్ని మార్చాలంటే ఆర్టికల్ 3ని అనుసరించాలి తప్పితే ఆర్డినెన్స్ ద్వారా చేయలేరు. ఏ రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా, ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను ఇంకో రాష్ట్రంలో కలపాలన్నా రెండు ప్రభుత్వాల శాసనసభలను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్టికల్ 3 చెబుతోంది. దీన్ని అనుసరించకుండా ఆదరాబాదరగా చేయడం మంచిది కాదని చెప్పాం. ప్రధాని మా మాటను మన్నిస్తారనే భావిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని, అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడినట్లు కేసీఆర్ వెల్లడించారు. అయితే మంగళవారం కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరిగినప్పటికీ అందులో పోలవరం అంశం చర్చకు రాకపోవడం గమనార్హం. బుధవారం కూడా కేబినెట్ మరోసారి భేటీ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ఎత్తును తగ్గించాల్సిందే.. ఇక పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డ్యామ్ ఎత్తును తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు మేం ఏమాత్రం వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుతో 139 గ్రామ పంచాయతీలు ముంపునకు గురవుతున్నాయని నీటి పారుదల శాఖ 111 జీవో ద్వారా తెలిపింది. శబరీ నది ద్వారా వచ్చిన నీటిని ఆంధ్రానే వాడుకోవాలి. దానికి మేము అంగీకరిస్తాం. అయితే నిర్మాణ పద్ధతిపైనే వివాదం ఉంది. గిరిజన ప్రాంతాల ముంపు తక్కువగా ఉండేలా డ్యామ్ ఎత్తును తగ్గించాలి. దీనిపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని టీఆర్ఎస్ అధినేత తెలిపారు. భూకంపాలు రావడానికి అత్యంత ఆస్కారమున్న ప్రదేశాలను దేశంలో పదకొండింటిని గుర్తిస్తే.. అందులో పోలవరం డ్యామ్ కట్టే ప్రదేశం రెండో స్థానంలో ఉందని ఆంధ్రా ప్రాంత ఇంజనీర్లు కూడా చెప్పినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఈ దృష్ట్యానే డ్యామ్ ఎత్తును తగ్గించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉండి ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే తలాతోక లేకుండా తయారయ్యే పరిస్థితి ఉంటుందని, దీనిపై మాట్లాడటానికి కేబినెట్లో తెలంగాణ మంత్రులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. వార్‌రూమ్‌కు వస్తానంటే ఎవరొద్దన్నారు.. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘వార్ రూమ్ అంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం. అక్కడ నాలుగు కంప్యూటర్లు, నలుగురు మనుషులు కూర్చొని వివరాలు, ఫిర్యాదులు తీసుకుంటారు. దీన్ని వివాదం చేస్తానంటే బాబు ఖర్మ. ఆయన ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. వార్ రూమ్‌కు నేనే వస్తానంటే.. ఎవరొద్దన్నారు. మేము స్వాగతిస్తున్నాం’ అని బదులిచ్చారు. కేంద్రం నుంచి కొత్త రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడంపై మాట్లాడుతూ... తాము 11 మంది ఎంపీలం ఉన్నామని, రాష్ర్ట వాటా కోసం కొట్లాడి సాధించుకుంటామని చెప్పారు. -
ఎవరిపై యుద్ధానికి వార్ రూం?
టీఆర్ఎస్కు చంద్రబాబు ప్రశ్న వార్ రూం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కనుమరుగైంది అవసరమైతే నేను కూడా వార్ రూంకు వస్తా ఇష్టప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు ఉద్యోగుల వివరాలన్నీ ప్రజల ముందుంచాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో వార్ రూంను ఎవరిపై యుద్ధం చేయటానికి ఏర్పాటు చేశారని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వార్ రూం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అవసరమైతే ఉద్యోగులకు అండగా తాను కూడా వార్ రూంకు వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఎవరు కూడా తమ ఇష్టప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఆయన శనివారం ఎన్టీఆర్ భవ న్లో మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు కావాల్సింది ప్రశాంత వాతావరణం, అభివృద్ధే తప్ప వార్ రూంలు కాదన్నారు. అయిదారు రోజుల నుంచి టీఆర్ఎస్ నేతల ప్రవర్తన, మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. వారు అభివృద్ధి విషయంలో పోటీ పడాలని సూచించారు. ఇంకా ఆయనేమన్నారంటే... గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ఆయనతో ఉన్న చనువు వల్ల నేను తెచ్చిన నిధుల వల్లే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో మిగులు బడ్జెట్ వచ్చింది. నేను హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చాను. తెలంగాణ నేతలు తమ వ్యాఖ్యలతో ఇప్పటికే దాన్ని పాడుచేశారు, ఇంకా పాడు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు నష్టపోతారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి కేసీఆర్ ప్రతి ఒక్కరిని కాపాడాలి. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా మాట్లాడినా అధికారంలోకి వచ్చినపుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు. తప్పుడు ప్రచారంతో రెచ్చగొడితే గట్టిగా సమాధానం చెప్తాం. ఉద్యోగులందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరి వివరాలు ప్రజల ముందు ఉంచాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే కేంద్రం సరిదిద్దాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ తదితర హామీలకు కట్టుబడి ఉన్నాను. విభజన ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటివరకు నాకు అంతుపట్టలేదు. ఇప్పుడు అధికారులు వివరించటంతో కొంత బోధపడింది. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీ రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. మంచిరోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తా. అలిపిరి వద్ద నాపై దాడి చేసిన గ ంగిరెడ్డిపై ఉన్న కేసులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీరుగార్చారు. గంగిరెడ్డి విదేశాలకు వెళ్లినా పోలీసులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారు. తిరుపతిలో కబ్జాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగింది. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల తిరుమల సంద ర్శించినపుడు పోలీసులను కోరాను. బాబుకు పలువురి అభినందన తాజాగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు శనివారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి అభినందించారు. అభినందనలు తెలిపిన వారిలో చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, సినీ నటులు రాజశేఖర్, జీవిత, రమ్యశ్రీ, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నేతలు వరలక్ష్మి, పద్మావతి, సునంద, ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ ఎం. జనార్ధనరెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం కన్వీనర్ ఎండీ నాగభూషణం, బాలాజీ స్కాన్ ఎండీ ఆలూరి లలిత, ఏపీ టూరిజం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. వీరారెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలున్నట్లు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబును అభినందించిన అమితాబ్ బచ్చన్ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన చంద్రబాబును బాలీవుడ్ సినీనటుడు అమితాబ్ బచ్చన్ శనివారం అభినందించారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తనను అభినందించిన అమితాబ్‌కు చంద్రబాబు ట్విట్టర్లో కృత జ్ఞతలు తెలిపారు. ఆయన మాటలు తమకు మరింత ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి తాము కృషి చేస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు. -
టీఆర్ఎస్ వ్యవహారంపై వార్ రూంలో కాంగ్రెస్ నేతల భేటి!
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ విలీన వ్యవహరంపై కాంగ్రెస్ వార్‌రూంలో అగ్రనేతలు భేటీ అయ్యారు. అగ్రనేతలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ భేటి అయ్యారు. విలీనంపై టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమా చేస్తుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై రేపటి మధ్యాహ్నం వరకు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దిగ్విజయ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. -
అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ