
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు ఇవాళ హాజరుకాలేనంటూ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సమాచారమిచ్చారు. కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు థాక్రేతో ఈరోజు నాకు మీటింగ్ ఉంది. అందుకే ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సైబర్ క్రైం పోలీసుల నోటీసులకు సమాధానమిచ్చారు.
'సంక్రాంతి పండగ తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తాను. 41 సీఆర్పీసీ నోటీసుకు కొంత వెసులుబాటు ఉంటుంది. నాపై కేసు పెట్టిన విషయం తెలియదు. మేము సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విమర్శించడానికే తప్ప అవమానించడానికి కాదు' అని మల్లు రవి చెప్పారు.
చదవండి: (కేంద్రం అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment