టీఆర్ఎస్ వ్యవహారంపై వార్ రూంలో కాంగ్రెస్ నేతల భేటి!
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ విలీన వ్యవహరంపై కాంగ్రెస్ వార్‌రూంలో అగ్రనేతలు భేటీ అయ్యారు. అగ్రనేతలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ భేటి అయ్యారు.
విలీనంపై టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమా చేస్తుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనే అంశంపై రేపటి మధ్యాహ్నం వరకు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దిగ్విజయ్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.