కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ సోదాల కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలుకి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే, సునీల్ కనుగోలు నోటీసీ కాపీని అందుకున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి సంతకం చేయడం గమనార్హం.
తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అవుతున్న మీమ్స్ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని గతంలోనే పోలీసులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లను కించపరుస్తూ పోస్టులులు పెట్టారని ఆరోపణ వచ్చాయి. దానిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు టీంలోని ముగ్గురు సభ్యులు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఐపీసి సెక్షన్ 469, 505 కింద సునీల్ కనుగోలు టీం మీద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ‘ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే ఇలా చేస్తారా.. నేను కూడా అదే పోస్ట్ చేస్తా’
పరారీలో సునీల్ కనుగోలు.. ‘మీమ్స్ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment