సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మాజీ ఎంపీ మల్లు రవికి నోటీసులు జారీ అయ్యాయి. 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్‌చార్జినంటూ ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్‌బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ కూడా రాశారు.
ఇదిలా ఉండగా, వార్ రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైం పోలీసుల విచారణకు సోమవారం హాజరయ్యారు. గంట పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ కనుగోలుకు సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: నేను సాఫ్ట్‌వేర్.. హార్డ్‌వేర్‌గా మార్చకండి
Comments
Please login to add a commentAdd a comment