సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విచారణ ముగిసింది. బుధవారం సుమారు మూడు గంటలపాటు ఆయన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ వార్ రూం కు నేనే ఇంఛార్జి గా ఉన్నాను. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపాను. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారు అని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ వార్ రూం ఇన్‌ఛార్జిగా తానే ఉన్నానని, అక్కడ జరిగే వ్యవహారాలన్నింటికి తానే బాధ్యుడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన.
‘‘కాంగ్రెస్ వార్ ద్వారా పోస్ట్ అవుతున్న వీడియోలకు నేనే బాధ్యుడిని. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే పోస్టింగులు చేస్తున్నాం. ఎవరినీ కించపరచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. పైగా నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నాం. అలాగే.. సునీల్ కనుగోలుకు, వార్ రూంకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మల్లు రవి మీడియా ద్వారా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment