
బీజేపీలోకి వెళ్లేది లేదు
బీజేపీలోకి వెళ్తున్నారంటూ గత కొన్ని రోజులుగా తమపై మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోకి వెళ్తున్నారంటూ గత కొన్ని రోజులుగా తమపై మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అమెరికాలో వ్యక్తిగత పర్యటనలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. గతంలో టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, ఇప్పుడేమో బీజేపీలోకి వెళ్తున్నారని కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానిం చారు. ఇలాంటి ప్రచారం చేయడం వెనుక కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా దెబ్బతీయాలని, కాంగ్రెస్‌ను బలహీనపర్చాలని కుట్రలు జరుగుతున్నట్టుగా అనుమానం కలుగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో పనిచేస్తామని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కుట్రలు చేసినా తాము కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతామన్నారు. తమను, కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలని టీఆర్‌ఎస్ నాయకులు, పార్టీలో తామంటే గిట్టని కొందరు నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.