గత పదేళ్లు ఇష్టానుసార నిర్ణయాలతో విద్యుత్ సంస్థలకు నష్టాలు: రాజగోపాల్‌రెడ్డి
సభకు రాకూడదనుకుంటే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలి
శాసనసభలో చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ బాధ్యతారహిత నిర్ణయాల వల్ల విద్యుత్‌శాఖ రూ.వేల కోట్లు నష్ట పోయిందని శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమ వారం ఆయన ‘విద్యుత్’అంశంపై చర్చను ప్రారంభించారు. ఉచిత విద్యుత్ తీసుకొచి్చన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని..గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించబట్టే విద్యుదుత్పత్తి పెరిగిందన్నారు.
గత పదేళ్లు ఇష్టానుసారం విద్యుత్ నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి సభలో లేకపోవడం దురదృష్టకరమని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. కేసీఆర్ సభకు రాకూ డదనుకుంటే ప్రతిపక్ష నేత హోదా వదులుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన దోపిడీపై విచారణ జరుగుతుందని, ఒప్పందాల కథ వెలికితీస్తామని చెప్పారు.
ఈ విద్యుత్ ఒప్పందాలు ఎందుకు?
‘‘భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం ప్రారంభించే నాటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని కాదని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండియాబుల్ వాళ్ల ప్లాంట్ కోసం తయారు చేసిన టర్బన్ బాయిలర్ వాడటం వల్ల భద్రాద్రి ప్లాంట్ పనిచేయని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఏదో ఒక యూనిట్ ఆగిపోతోంది. అది పదేళ్ల కిందటి పాత ప్లాంటులా ఉందని చీఫ్ ఇంజనీర్ నివేదిక కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ ప్లాంట్ వ్యయం రూ.7,200 కోట్ల నుంచి రూ.10 వేలకోట్లకు పెరిగింది..’’అని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.
బీహెచ్‌ఈఎల్‌కు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టు ఇవ్వడం, ఆ తర్వాత సివిల్ పనులు బీఆర్‌ఎస్ నేతల బినామీలకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తుంటే అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రంలో కుటుంబ పాలన నడిచిందని, ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర వారిదని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment