సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం. అయితే, కోమటిరెడ్డి పార్టీ మారతాడంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ కోరేందుకు రాజగోపాల్‌రెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధులు సంప్రదించగా, పార్టీ మార్పు వార్తలు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు.
బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కాగా, రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది.
చదవండి: బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 36% సీట్లు
Comments
Please login to add a commentAdd a comment