సాక్షి, హైదరాబాద్: ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’ ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో, తెలంగాణ కాషాయ పార్టీలో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఇక, కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్‌రెడ్డి తీరుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల సైలెంట్ అయినట్టు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్ కావడంతో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ వీడిన వారందరూ మళ్లీ హస్తం గూటికి వస్తారు అని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది.
ఇది కూడా చదవండి: గద్దర్ అంటే మాకు గౌరవం ఉంది: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment