
సాక్షి, నల్గొండ: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కుటుంబంలో జరిగిన వివాహా కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సుమన్ బామ్మర్ది వెంకటేశ్ గౌడ్ వివాహం బుధవారం ఉదయం పావనితో జరిగింది. నల్గొండ జిల్లా చండురులో జరిగిన ఈ విహహా వేడుకకు హాజరైన కేటీఆర్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్‌తోపాటు రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌లు కూడా వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇటీవల కేటీఆర్‌ను స్వయంగా కలిసిన సుమన్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను ఆయనకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment