weeding cermony
-
Bhadrachalam: రామాలయంలో ఇక ‘పెళ్లిసందడి’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఇకపై పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2018 వరకు రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఉపాలయం పక్కన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుమతి ఇచ్చేవారు. అనంతరం పలు కారణాలతో ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలను నిరాకరించారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, ఈలోపు కోవిడ్ కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కరోనా నిబంధనలు సడలించడం, భక్తుల నుంచి సైతం విజ్ఞప్తులు పెరగడంతో ఆలయ ఈవో శివాజీ తాజాగా వైదిక కమిటీతో చర్చించారు. వైదిక కమిటీ, ఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.1,116 చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చు. అలాగే, చిత్రకూట మండపంలోని విశాలమైన వేదిక వద్ద శుభకార్యాల నిర్వహణకు రూ.10,116 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ శుభకార్యాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, భోజనాలకు మాత్రం అనుమతించరు. కాగా, వివాహాది శుభకార్యాల్లో అన్యమతాలకు చెందిన వస్తువులు, ఇతర సామగ్రి వినియోగించకుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
ఘనంగా మంత్రి ఈటల కుమార్తె వివాహం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత వివాహం డాక్టర్ అనూప్‌తో శుక్రవారం మేడ్చల్ మండలం పూడూర్‌లోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో పాటు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్,రంజిత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లు ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్,హరీష్‌రావు, మల్లార్డెడి,తలసాని శ్రీనివాస్‌యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ, సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి,ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్,బీజేపీ, ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు,వివిధ శాఖ అధికారులు , వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొని నూతన వదూవరులను ఆశీర్వదించారు. చదవండి: మంత్రి ఈటల నివాసంలో పెళ్లి సందడి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంత్రి ఈటల నివాసంలో పెళ్లి సందడి
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాసంలో పెళ్లి సందడి మొదలైంది. ఈటెల కూతురు డాక్టర్ నీత వివాహం శుక్రవారం మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని తన నివాసం వద్ద నిర్వహిస్తుండడంతో సందడి నెలకొంది. వరుడు కూడా డాక్టరే. మంత్రి ఈటల పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా పలువురు నాయకులు సైతం మంత్రి నివాసానికి వెళ్లి పనుల్లో బిజీగా మారారు. గురువారం మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి ఈటల నివాసానికి వెళ్లి మంత్రితో కలిసి పెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా మంత్రి ఈటల కుమారుడు నితిన్‌కు కూడా రెండేళ్ల కిత్రమె వివాహం అయింది. -
సుమన్ బామ్మర్ది వివాహం, హాజరైన కేటీఆర్
సాక్షి, నల్గొండ: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కుటుంబంలో జరిగిన వివాహా కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సుమన్ బామ్మర్ది వెంకటేశ్ గౌడ్ వివాహం బుధవారం ఉదయం పావనితో జరిగింది. నల్గొండ జిల్లా చండురులో జరిగిన ఈ విహహా వేడుకకు హాజరైన కేటీఆర్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్‌తోపాటు రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌లు కూడా వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇటీవల కేటీఆర్‌ను స్వయంగా కలిసిన సుమన్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను ఆయనకు అందజేశారు. -
ప్రియాంక పెళ్లి అతనితోనేనా...
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్త నెట్టింట్లో కొంతకాలంగా హల్చల్ చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నిక్ జోనాస్ బంధువు పెళ్లికి ఇరువురూ వెళ్లి, చేతులు జోడించి నడవడం పుకార్లకు మరింత బలం చేకూర్చుతున్నాయి. పెళ్లిలోకూడా నిక్ కుటుంబ సభ్యులతో ప్రియాంక చనువుగా ఉన్నారు. ఇద్దరూ చేతులు జోడించి కొత్త జంటలా పెళ్లికి హాజరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రియాంక వివాహం నిక్‌తోనే అవుతుందని సోషల్ మీడియాలో మారుమోగుతుంది. వారి ప్రేమ వ్యవహారన్ని బహిరంగంగా ప్రకటించనప్పటికీ ఆ జంట చూడముచ్చటగా ఉందని ప్రియాంక సన్నిహితులు ఒకరు అన్నారు. కాగా గతంలో ప్రియాంక, నిక్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్లాయి. 2017లో రెడ్ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. జిమ్మి కిమ్మెల్ షోలో దీనిపై ఎదురైన ప్రశ్నకు ప్రియాంక.. ఇద్దరం రాల్ఫ్ లారెన్ డ్రెస్‌లను వేసుకున్నాం. అందుకే అలా ఫొటోలకు పోజిచ్చాం అని చెప్పారు. -
ఘనంగా నటుడు నకుల్ వివాహం
తమిళసినిమా: నటుడు నకుల్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలి మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడు అడుగులు నడిచారు. బాయ్స్ చిత్రంలో నలుగురు హీరోలలో ఒకరిగా పరిచయం అయిన నకుల్ ఆ తరువాత కాదలిల్ విళిదేన్, మాచిలామణి, నాన్రాజావగపోగిరేన్, తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ తదితర చిత్రాలలో నటించారు. ఈయన నటి దేవయాని తమ్ముడన్నది తెలిసిన విషయమే. కాగా ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పని చేస్తున్న శ్రుతి భాస్కర్ అనే అమ్మాయి నకుల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు పంచజెండా ఊపడంతో గత నెలలో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆదివారం ఉదయం స్థానిక ఎగ్మోర్‌లోని రాణి మెయ్యమ్మై కల్యాణ మండపంలో జరిగింది. వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఉదయం 10.41 గంటలకు నకుల్ శ్రుతి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.